kabul blasts: కాబుల్‌ బాంబు పేలుళ్లను తామే జరిపినట్లు ప్రకటించిన ఇస్లామిక్‌ స్టేట్‌ 

అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబుల్‌లోని హమీద్‌ కర్జాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల చోటుచేసుకున్న వరుస పేలుళ్లను తామే జరిపినట్లు ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) ప్రకటించింది. ఇద్దరు ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడడంతో 12 మంది అమెరికా రక్షణ సిబ్బందితో సహా సుమారు 72 మంది

Updated : 27 Aug 2021 05:55 IST

కాబుల్‌: అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబుల్‌లోని హమీద్‌ కర్జాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల చోటుచేసుకున్న వరుస పేలుళ్లను తామే జరిపినట్లు ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) ప్రకటించింది. ఇద్దరు ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడడంతో 12 మంది అమెరికా రక్షణ సిబ్బందితో సహా సుమారు 72 మంది చనిపోయారు. 143 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. అబే గేటు వద్ద చోటుచేసుకున్న పేలుడుకు సంబంధించి ఆత్మాహుతి బాంబర్‌ ఫొటోను ఐఎస్‌ విడుదల చేసింది. ఎయిర్‌పోర్ట్‌ వద్ద నిమిషాల వ్యవధిలోనే రెండు పేలుళ్లు జరిగాయి. అనంతరం కొన్ని గంటల తర్వాత సెంట్రల్‌ కాబుల్‌లో మరో పేలుడు జరిగినట్లు ప్రాథమిక సమాచారం.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు