Kashmir: బ్రిటన్‌ పార్లమెంట్‌లో పాక్‌కు షాక్‌.. భారత్‌కు మద్దతు..

పాకిస్థాన్‌కు బ్రిటన్‌ ఎంపీ బాబ్‌ బ్లాక్‌మన్‌ షాక్‌ ఇచ్చారు. గురువారం హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. కశ్మీర్‌ నుంచి

Updated : 24 Sep 2021 18:59 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పాకిస్థాన్‌కు బ్రిటన్‌ ఎంపీ బాబ్‌ బ్లాక్‌మన్‌ షాక్‌ ఇచ్చారు. గురువారం హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. కశ్మీర్‌ నుంచి భారత భద్రతా దళాలు వెనక్కి వెళితే అఫ్గానిస్థాన్‌ వంటి పరిస్థితులు తలెత్తుతాయని తెలిపారు. అక్కడి ప్రజాస్వామ్యాన్ని ఛాందసవాద మూకలు ధ్వంసం చేస్తాయని అభిప్రాయపడ్డారు. కశ్మీర్‌పై జరిగిన చర్చలో ఆయన ఈ రకంగా స్పందంచారు. ఈ అంశంపై చర్చను డెబ్బీ అబ్రహమ్స్‌, పాకిస్థాన్‌ మూలాలున్న ఎంపీ యాస్మిన్‌ ఖురేషీలు  ప్రవేశపెట్టారు. 

ఈ చర్చ సందర్భంగా బ్లాక్‌మన్‌ మాట్లాడుతూ..‘‘మనం అఫ్గానిస్థాన్‌లో జరిగిందేమిటో ప్రత్యక్షంగా చూశాము. అలాంటి సమస్యే జమ్ము, కశ్మీర్‌లో ఉంది. ఇక్కడ ఇస్లామిక్‌ ఛాందసవాద శక్తులు ప్రజాస్వామ్యాన్ని కుప్పకూలుస్తాయి. జమ్ము-కశ్మీర్‌ను అఫ్గానిస్థాన్‌లా కాకుండా కాపాడింది ఒక్క భారత సైన్యం మాత్రమే. ఆ ప్రాంతం భారత్‌ అంతర్భాగం కావడంతో వారు చేపట్టే చర్యలు అర్థవంతమైనవే’’ అని పేర్కొన్నారు. వాస్తవాలను గుర్తించాలని సహ ఎంపీలను ఆయన కోరారు. బ్లాక్‌మన్‌ స్పందనపై పాక్‌కు మద్దతు ఇస్తున్న ఎంపీలు సభలో గందరగోళం సృష్టించారు.

అంతకు ముందు హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో మరో ఎంపీ బారీ గార్డినర్‌ కూడా ఇటువంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. పాకిస్థానే తాలిబన్‌ నాయకులకు ఆశ్రయమిచ్చిందని ఆరోపించారు. ఐఎస్‌ఐ వారికి, ఇతర ఉగ్ర సంస్థలకు అవసరమైన సేవలను అందించిందని పేర్కొన్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని