Gaza: గాజాపై మరోసారి వైమానిక దాడులు

గత నెలలో 11 రోజులపాటు జరిగిన యుద్ధం ఆగిన తర్వాత ఇజ్రాయెల్ రెండోసారి గాజా ప్రాంతంపై వైమానిక దాడులు చేసింది. గాజాలోని హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పైకి వరుసగా మూడోరోజూ అగ్నితో కూడిన బెలూన్లను ప్రయోగించారు.

Published : 18 Jun 2021 21:18 IST

కాల్పుల విరమణ జరిగి నెల తిరక్కుండానే మొదలైన బాంబుల మోత

గాజా: గత నెలలో 11 రోజులపాటు జరిగిన యుద్ధం ఆగిన తర్వాత ఇజ్రాయెల్ రెండోసారి గాజా ప్రాంతంపై వైమానిక దాడులు చేసింది. గాజాలోని హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పైకి వరుసగా మూడోరోజూ అగ్నితో కూడిన బెలూన్లను ప్రయోగించారు. దీనికి ప్రతిగా గురువారం రాత్రి ఇజ్రాయెల్ సైన్యం గాజా ప్రాంతంపై వైమానిక దాడులు చేసింది. బెలూన్ల దాడికి ప్రతీకారంగా తమ ఫైటర్ జెట్‌ విమానాలు హమాస్ మిలిటెంట్ల స్థావరాలు, ఓ రాకెట్ లాంచ్ సైట్‌పై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. అయితే ఈ వైమానిక దాడుల్లో జరిగిన నష్టంపై ఇంకా ఎలాంటి వివరాలు వెల్లడి కాలేదు. కాల్పుల విరమణ ఒప్పందం జరిగి నెల రోజులు కూడా పూర్తికాకుండానే గాజాలో మళ్లీ బాంబుల మోత మొదలయింది. బుధవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్‌ వాయుసేనకు చెందిన విమానాలు గాజాలోని ఖాన్‌ యూనిస్‌ ప్రదేశంపై దాడులు చేశాయి. ప్రమాదకర పదార్థాలతో నింపిన బెలున్లను గాజా నుంచి వదులుతున్నారని ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ పేర్కొంది. ఈ బెలూన్ల కారణంగా దేశంలోని పలుచోట్ల నిప్పు అంటుకొందని వెల్లడించింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్‌ ఫైర్‌ సర్వీస్‌ కూడా ధ్రువీకరించింది. 20 అగ్ని ప్రమాద ఘటనలు చోటు చేసుకొన్నట్లు పేర్కొంది.
 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని