Isro: మరికొద్ది గంటల్లో ఆకాశంలో ఉత్కంఠ దృశ్యం.. పెను సవాల్‌కు ఇస్రో సై..!
మరికొద్ది గంటల్లో భారత గగనతల చరిత్రలో ఉత్కంఠ దృశ్యం ఆవిష్కృతం కానుంది. భారత్ ఓ ఉపగ్రహాన్ని పూర్తి నియంత్రిత విధానంలో సముద్రంలో కూల్చివేయనుంది.
ఇంటర్నెట్‌డెస్క్ ప్రత్యేకం
చైనా ఉపగ్రహాలు తరచూ కక్ష్య నుంచి అదుపుతప్పి భూవాతవరణంలోకి దూసుకొచ్చిన ఘటనలు ఈ మధ్య కాలంలో తరచూ చూస్తూనే ఉన్నాం. చైనా ఉపగ్రహ శకలాలు ప్రపంచాన్నివణికించాయి. ఈ నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. కాలం చెల్లిన తన ఉపగ్రహాలను నియంత్రిత విధానంలో కూల్చివేయడంపై ఇస్రో(Isro) కసరత్తు మొదలుపెట్టింది. వాస్తవానికి అంతరిక్షంలోనే ఉపగ్రహాన్ని పేల్చివేసే సామర్థ్యం భారత్‌కు ఉంది. కానీ, అలా చేస్తే వాటి శకలాలు భవిష్యత్తులో సమస్యాత్మకంగా మారతాయి. ఈ క్రమంలో కాలం చెల్లిన ఓ ఉపగ్రహాన్ని పూర్తి నియంత్రిత విధానంలో సముద్రంలో కూల్చివేసేందుకు రంగం సిద్ధం చేసింది. నేటి సాయంత్రం ఈ ఘట్టం ఆవిష్కృతం కానుంది.
ఏ ఉపగ్రహాన్ని ఎంచుకుంది..
తక్కువ భూకక్ష్యలో పరిభ్రమించే ‘మేఘ-ట్రోపికస్-1(ఎంటీఐ) ఉపగ్రహాన్ని ఇస్రో(Isro) ఈ ప్రయోగానికి ఎంచుకుంది. దీనిని 2011 అక్టోబర్ 12న ఫ్రాన్స్ స్పేస్ ఏజెన్సీ సీఎన్‌ఈసీ కలిసి సంయుక్తంగా ప్రయోగించాయి. ఉష్ణమండల వాతావరణ, పర్యావరణంపై అధ్యయనానికి దీనిని వాడాయి. వాస్తవానికి మూడేళ్లు మాత్రమే ఈ ఉపగ్రహం పనిచేస్తుందని తొలుత అంచనావేశారు. కానీ, ఇది 2021 వరకు నిరంతరాయంగా సేవలు అందించింది.
బాధ్యతగా తొలగించాలి..
ది ఇంటర్ ఏజెన్సీ స్పేస్ డెబ్రిస్ కోఆర్డినేషన్ కమిటీ అంతరిక్షంలో శకలాలను తగ్గించడానికి మార్గదర్శకాలు జారీ చేసింది. వీటి ప్రకారం భూ దిగువ కక్ష్యలో తిరిగే ఉపగ్రహాల జీవిత కాలం ముగిశాక వాటిని నియంత్రిత పద్ధతిలో భూమిపై సురక్షిత స్థానంలో కూల్చివేయాలని చెబుతోంది. లేదా ఆర్బిటాల్ లైఫ్ టైమ్ 25 ఏళ్లకంటే తక్కువ ఉన్నవాటిని భూదిగువకక్ష్యలో ప్రవేశపెట్టాలని పేర్కొంటోంది. ఈ కక్ష్యలో తిరిగే ఉపగ్రహాలు మెల్లగా భూవాతావరణంలోకి వచ్చేందుకు పట్టే సమయాన్ని ఆర్బిటాల్ లైఫ్‌టైమ్‌గా పరిగణిస్తారు. ఇస్రో ప్రయోగించిన టన్ను బరువున్న ‘మేఘ’ ఉపగ్రహా ఆర్బిటాల్ లైఫ్‌టైమ్ 100 సంవత్సరాలు. దీనిలో ఇంకా 125 కిలోల ఇంధనం మిగిలి ఉంది. ఫలితంగా సుదీర్ఘకాలం కక్ష్యలో ఉంటే ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. వాస్తవానికి దానిలో ఉన్న ఇంధనం నియంత్రిత విధానంలో భూవాతావరణంలో ప్రవేశించడానికి సరిపోతుంది. 2022 ఆగస్టు నుంచి దీనిని కక్ష్య నుంచి కిందకు తీసుకురావడానికి 18 భ్రమణాలు చేయించారు.
సవాళ్లు ఏమిటీ..?
సాధారణంగా పెద్ద ఉపగ్రహాలు, రాకెట్ శకలాలు భూవాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత ఏర్పడే ఘర్షణకు తట్టుకొనే అవకాశం ఉంది. ఇటువంటి వాటిని నియంత్రిత విధానంలో కూలిస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలు దాదాపు ఉండవు. అటువంటి ఉపగ్రహాలు మొత్తం ఈ విధంగా కూల్చివేసేలా డిజైన్ చేస్తారు. ఇక్కడే ఇస్రోకు అసలైన సవాలు ఉంది. మేఘను నియంత్రిత విధానంలో భూకక్ష్యలోకి తెచ్చేలా డిజైన్ చేయలేదు. ఇదే సవాలుగా మారనుంది. ఈ ఉపగ్రహంలోని కాలం చెల్లిన పరికరాల పనితీరు ఏమాత్రం బాగోదు. దీనికి తోడు భూమిపైకి తిరిగి వచ్చే సమయంలో కఠిన వాతావరణ పరిస్థితులను ఉపగ్రహ సబ్‌సిస్టమ్స్ తట్టుకోలేవు. ‘మేఘ’ ఉపగ్రహ కూల్చివేత సమయంలో ఎదురయ్యే సవాళ్లను అధ్యయనం చేయవచ్చని ఇస్రో భావిస్తోంది.
* కూల్చివేత సమయంలో ఉపగ్రహం నిర్దేశించిన మార్గంలోనే భూవాతావరణంలోకి ప్రవేశించి ప్రయాణించాలి. అప్పుడే నిర్దేశిత ప్రదేశంలో కూలుతుంది. ఒక వేళ ఉపగ్రహం అదుపు తప్పితే జనావాసాలపై పడే ప్రమాదం ఉంది.
* భూవాతావరణ ఘర్షణ కారణంగా విద్యుదయస్కాంత రేడియేషన్‌కు గురై ఉపగ్రహంలోని వ్యవస్థలు పనిచేయకపోవచ్చు. అప్పుడు ఇది నియంత్రణ కోల్పోతుంది. లేకపోతే కమ్యూనికేషన్ కోల్పోయి.. నిర్దేశిత మార్గం తప్పి ప్రయాణించవచ్చు.
* భూవాతావరణంలోని ఘర్షణకు లోనై ఉపగ్రహం శకలాలు విడిపోయి వెదజల్లే ప్రమాదం ఉంది.
* నియంత్రణ సరిగా లేకపోతే ఉప్రగ్రహంలో వాడే విషపూరిత పదార్థాలు, రేడియోయాక్టివ్ ఐసోటోప్‌లు, రసాయనాల నుంచి ముప్పు ఉండవచ్చు.
* కూలిపోయే ఉపగ్రహ మార్గాన్ని బలమైన గాలులు, తుపానులు వంటివి మార్చవచ్చు.
ఎప్పుడు ఎక్కడ కూలుతుంది..?
ఈ ఉపగ్రహం మార్చి 7వ తేదీన సాయంత్రం 4.30 నుంచి రాత్రి 7.30లోపు భూమిపై కూలిపోవచ్చని అంచనా వేస్తున్నారు. పసిఫిక్ మహాసముద్రంలోని నిర్జన ప్రదేశంలో ఇది పడేలా మార్గాన్ని నిర్దేశించారు. భూవాతవరణ ఘర్షణకు కూడా ఈ ఉపగ్రహం తట్టుకొంటుందని చెబుతున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
US Spelling Bee: అమెరికా స్పెల్లింగ్ బీ విజేతగా దేవ్‌షా..!
-
Politics News
Rahul Gandhi: 2024 ఫలితాలు ఆశ్చర్యపరుస్తాయ్..: రాహుల్ గాంధీ
-
Movies News
ponniyin selvan 2 ott release: ఓటీటీలోకి ‘పొన్నియిన్ సెల్వన్-2’.. ఆ నిబంధన తొలగింపు
-
General News
Telangana Formation Day: తెలంగాణ.. సాంస్కృతికంగా ఎంతో గుర్తింపు పొందింది..!
-
General News
Telangana Formation Day: తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు
-
India News
IRCTC: కేటరింగ్ సేవల్లో సమూల మార్పులు: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్