VIP security: ఎంపీ నవనీత్ రానా, ఇస్రో ఛైర్మన్‌కు కేంద్రం వీఐపీ భద్రత
మహారాష్ట్రలోని అమరావతి లోక్‌సభ సభ్యురాలు, సినీనటి నవనీత్ రానా, ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక......
దిల్లీ: మహారాష్ట్రలోని అమరావతి లోక్‌సభ సభ్యురాలు, సినీనటి నవనీత్ రానా, ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక భద్రతను కల్పించింది. వీరిద్దరికీ కేంద్ర సాయుధ కమాండోలతో కూడిన వీఐపీ భద్రతను కల్పించినట్టు అధికారులు వెల్లడించారు. వీరిద్దరి భద్రతకు ముప్పు ఉందన్న కేంద్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీల ప్రత్యేక సిఫార్సులను ఆమోదించిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గత వారం పారామిలటరీ సాయుధ కమాండోలతో భద్రత కల్పించినట్టు తెలిపారు. నవనీత్ రానాకుకు ముగ్గురు నుంచి నలుగురు సీఐఎస్ఎఫ్ సాయుధ కమాండోలు భద్రత కల్పించేలా ‘వై కేటగిరీ’ సెంట్రల్ కవర్‌ను పొందారన్నారు. అలాగే, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్‌కు ‘వై ప్లస్ కేటగిరీ’ భద్రతను కల్పించినట్టు తెలిపారు. దేశంలోని ఎక్కడికి వెళ్లినా ఈ రాకెట్ సైంటిస్ట్ వెంట నలుగురు నుంచి ఆరుగురు సాయుధ కమాండోలు వెంట ఉంటారు.
మరోవైపు హనుమాన్ జయంతి రోజు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే హనుమాన్ చాలీసా పఠించాలనీ.. లేదంటే ఈ నెల 23న మాతోశ్రీ (సీఎం ఉద్ధవ్ నివాసం) వద్ద హనుమాన్ చాలీసా పఠించనున్నట్టు ఇటీవల నవనీత్ రాణా భర్త, ఎమ్మెల్యే రవి రాణా పేర్కొన్న విషయం తెలిసిందే. దీంతో శుక్రవారం ముంబయి పోలీసులు వీరిద్దరికీ నోటీసులు ఇచ్చారు. శాంతిభద్రతలకు ఎలాంటి ఆటంకం కలిగించేలా వ్యవహరించొద్దని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్