OneWeb: వన్‌వెబ్‌ కాన్‌స్టలేషన్‌ సంపూర్ణం.. కక్ష్యలోకి 618 ఉపగ్రహాలు

OneWeb: దీంతో అంతర్జాతీయ కవరేజీకి ఉపకరించేలా లో ఎర్త్‌ ఆర్బిట్‌ (ఎల్‌ఈఓ) కాన్‌స్టలేషన్‌ను వన్‌వెబ్‌ పూర్తి చేసింది.

Published : 26 Mar 2023 20:36 IST

దిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)తో కలిసి 36 ఉపగ్రహాలను సునీల్‌ భారతీ మిత్తల్‌కు చెందిన శాటిలైట్‌ కమ్యూనికేషన్స్‌ కంపెనీ వన్‌వెబ్‌ ఆదివారం కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దీంతో అంతర్జాతీయ కవరేజీకి ఉపకరించేలా 618 ఉపగ్రహాల ‘లో ఎర్త్‌ ఆర్బిట్‌ (ఎల్‌ఈఓ) కాన్‌స్టలేషన్‌’ను పూర్తి చేసింది. జులై-ఆగస్టు కల్లా భారత్‌లో వన్‌వెబ్‌ సేవలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు గత నెలలో సునీల్‌ మిత్తల్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. 

శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి ఎల్‌వీఎం-3 రాకెట్‌ 36 రాకెట్లను మోసుకెళ్లి కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఇది వన్‌వెబ్‌కు 18వ ప్రయోగం. ఈ ఏడాదిలో మూడోది. ఈ తొలి తరం ఎల్‌ఈఓ కాన్‌స్టెలేషన్‌ను పూర్తి చేయడం ద్వారా 2023లో అంతర్జాతీయ కవరేజీ సేవలు మొదలుపెట్టేందుకు వీలవుతుందని కంపెనీ వివరించింది. భారత్‌లో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అందించడానికి వన్‌వెబ్‌కు లైసెన్సులున్నాయి. అయితే స్పెక్ట్రమ్‌ కేటాయిస్తేనే, సేవలను మొదలుపెట్టడానికి వీలవుతుంది. కంపెనీలకే కాకుండా పట్టణాలు, గ్రామాలు, మున్సిపాలిటీలు, పాఠశాలలకు భద్రమైన సొల్యూషన్లను అందించనున్నట్లు సంస్థ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని