ISRO: విజయవంతమైన ‘పుష్పక్‌’ ప్రయోగం

పునర్‌ వినియోగానికి అవకాశం ఉండే అంతరిక్ష వాహనం (రీ యూజబుల్‌ లాంచ్‌ వెహికల్‌) ‘పుష్పక్‌’ను ఇస్రో మూడోసారి ప్రయోగించి పనితీరును సమీక్షించింది. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా చెళ్లకెర తాలూకా నాయకనహట్టిలోని డీఆర్‌డీవో ఆవరణలో ఆదివారం ఈ సన్నాహక పరీక్షను నిర్వహించారు.

Published : 24 Jun 2024 05:11 IST

రన్‌వేపై సురక్షితంగా దిగిన పుష్పక్‌

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే: పునర్‌ వినియోగానికి అవకాశం ఉండే అంతరిక్ష వాహనం (రీ యూజబుల్‌ లాంచ్‌ వెహికల్‌) ‘పుష్పక్‌’ను ఇస్రో మూడోసారి ప్రయోగించి పనితీరును సమీక్షించింది. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా చెళ్లకెర తాలూకా నాయకనహట్టిలోని డీఆర్‌డీవో ఆవరణలో ఆదివారం ఈ సన్నాహక పరీక్షను నిర్వహించారు. ప్రయోగంలో భాగంగా వాయుసేనకు చెందిన చినూక్‌ హెలికాప్టర్‌.. పుష్పక్‌ను 4.5 కి.మీ. ఎత్తుకు తీసుకెళ్లి విడిచిపెట్టింది. స్వయంచాలిత వ్యవస్థల ద్వారా రన్‌వేను కనుగొన్న పుష్పక్‌.. నిర్దేశిత ప్రదేశంలో సురక్షితంగా దిగింది. రన్‌వేపై తొలుత దాని వేగం గంటకు 320 కి.మీ. ఉండగా.. పారాచూట్‌ సాయంతో 100 కి.మీ.కు వేగాన్ని కుదించుకుంది. అనంతరం బ్రేకులు ఉపయోగించుకుని నిశ్చల స్థితికి చేరుకుంది. పుష్పక్‌ చివరి సన్నాహక ప్రయోగం విజయవంతమైందని ఇస్రో ఓ ప్రకటనలో తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని