పాల్‌ దినకరన్‌ నివాసంలో ఐటీ సోదాలు

తమిళనాడులో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం నుంచి ఆదాయపన్నుశాఖ అధికారులు తమిళనాడులోని 28 ప్రాంతాల్లో తనిఖీలు

Updated : 20 Jan 2021 17:05 IST

చెన్నై: తమిళనాడులో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం నుంచి 200 మంది ఆదాయపన్నుశాఖ అధికారులు తమిళనాడులోని 28 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. క్రైస్తవ మతబోధకుడు పాల్‌ దినకరన్‌ నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన కారుణ్య ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్సెస్‌, జీస్‌ కాల్స్‌ మినిస్ట్రీ కార్యాలయంలోనూ ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. పన్నుల ఎగవేత, విదేశాల్లో పెట్టుబడులపై ఆరోపణల నేపథ్యంలో ఐటీ శాఖ తనిఖీలు చేపట్టినట్టు సమాచారం. దీనికి సంబంధించి సోదాలు ముగిసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఐటీ శాఖ తెలిపింది.

ఇవీ చదవండి..
రాజు పట్ల చిన్న తప్పిదానికి అంత శిక్షా!

ప్రమాణ స్వీకార విందు.. ఏమున్నాయంటే..


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని