Uttar pradesh: యూపీలో ఐటీదాడుల కలకలం.. అఖిలేశ్‌ సన్నిహితుల ఇళ్లల్లో సోదాలు

మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీకి చెందినవారిపై ఆదాయపు పన్ను అధికారుల సోదాలు కలకలం రేపుతున్నాయి. సమాజ్‌వాదీ

Published : 18 Dec 2021 11:36 IST

లఖ్‌నవూ: మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీకి చెందినవారిపై ఆదాయపు పన్ను అధికారుల సోదాలు కలకలం రేపుతున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ అత్యంత సన్నిహితుడు, పార్టీ అధికార ప్రతినిది రాజీవ్‌ రాయ్‌ నివాసంలో ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. అఖిలేశ్‌ కుటుంబానికి మంచి పట్టున్న మెయిన్‌పురిలో మరో ఎస్పీ నేత ఇంట్లోనూ ఈ సోదాలు జరిగాయి. 

రాజీవ్‌ రాయ్‌కి చెందిన సంస్థ.. కర్ణాటకలో చాలా విద్యాసంస్థలను నడుపుతోంది. ఈ సంస్థ పన్ను ఎగవేతకు సంబంధించి అధికారులు సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే ఈ దాడులను రాయ్‌ తీవ్రంగా ఖండించారు. ‘‘నాకు ఎలాంటి క్రిమినల్‌ బ్యాగ్రౌండ్‌ లేదు. నా వద్ద నల్లధనం కూడా లేదు. నేను ప్రజలకు సేవ చేస్తున్నా. ప్రభుత్వానికి అది నచ్చడం లేదు. దాని ఫలితమే ఇది’’ అని రాయ్‌ మీడియాతో అన్నారు. ఇక అఖిలేష్‌ మరో సన్నిహితుడు మనోజ్‌ యాదవ్‌ నివాసంలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.

రాయ్‌.. సమాజ్‌వాదీ పార్టీ జాతీయ కార్యదర్శి కూడా. 2012 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించారు. 2014 ఎన్నికల్లో ఘోసి నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అఖిలేష్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న రాయ్‌ నివాసంలో ఆకస్మిక ఐటీ సోదాలు.. ప్రభుత్వం కుట్రే అని ఎస్పీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని