Oxygen: భారత్‌కు 24 క్రయోజెనిక్‌ కంటైనర్లు 

దేశంలో కరోనా విలయం సృష్టిస్తున్న తరుణంలో మెడికల్‌ ఆక్సిజన్‌కు తీవ్ర కొరత ఏర్పడింది. దేశీయ ప్లాంట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతున్నప్పటికీ అవసరాలకు సరిపడా ఆక్సిజన్ అందడం లేదు. దీంతో  కొరతను అధిగమించేందుకు ఇతర దేశాల నుంచి...

Updated : 24 Apr 2021 19:25 IST

దిల్లీ: దేశంలో కరోనా విలయం సృష్టిస్తున్న తరుణంలో మెడికల్‌ ఆక్సిజన్‌కు తీవ్ర కొరత ఏర్పడింది. దేశీయ ప్లాంట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతున్నప్పటికీ అవసరాలకు సరిపడా ఆక్సిజన్ అందడం లేదు. దీంతో  కొరతను అధిగమించేందుకు ఇతర దేశాల నుంచి భారత్‌ ప్రాణవాయువును దిగుమతి చేసుకుంటోంది. పొరుగు దేశాల నుంచి త్వరలోనే వాయుమార్గంలో 24 క్రయోజెనిక్‌ ఆక్సిజన్‌ ట్యాంకర్లు భారత్‌కు బయలు దేరుతున్నట్లు ఐటీసీ లిమిటెడ్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్రదేశం నుంచి సరఫరా వేగాన్ని పెంచేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. ‘‘ భారత్‌లో ఏర్పడిన మెడికల్‌ ఆక్సిజన్‌ కొరతను నివారించేందుకు, కరోనా బాధితులకు సకాలంలో వైద్యసేవలు అందించేందుకు లిండే ఇండియాల లిమిటెడ్‌ సౌజన్యంతో 24 క్రయోజెనిక్‌ ఆక్సిజన్‌ కంటైనర్లను ఎయిర్‌లిఫ్ట్‌ చేస్తున్నాం’’ అంటూ ఐటీసీ ట్వీట్‌ చేసింది.

మరోవైపు ఆక్సిజన్‌ను దిగుమతి చేసేందుకు భారత్‌ ప్రభుత్వం సింగపూర్‌తోనూ సంప్రదింపులు జరిపింది. చర్చలు ఫలించడంతో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్సుకు చెందిన ఖాళీ యుద్ధవిమానాలు అక్కడికి బయల్దేరి వెళ్లాయి. అత్యవసర పరిస్థితుల్లో ఎయిర్‌ఫోర్సు సేవలను కూడా వినియోగించుకోవచ్చని కేంద్రం రాష్ట్రాలకు అవకాశమిచ్చింది. అంతేకాకుండా దేశంలో ఆక్సిజన్‌ కొరతను నివారించేందుకు రక్షణ శాఖ కూడా చర్యలు మొదలు పెట్టింది. జర్మనీ నుంచి 23 మొబైల్‌ ఆక్సిజన్‌ తయారీ ప్లాంట్లను దిగుమతి చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. మరో వారం రోజుల్లో అవి కూడా అందుబాటులోకి రానున్నాయి. గత మూడు రోజులుగా భారత్‌లో తీవ్ర ఆక్సిజన్‌ కొరత వేధిస్తోంది. ఆక్సిజన్‌ అందుబాటులో లేకపోవడంతో చాలా ఆస్పత్రులు చేతులెత్తేస్తున్నాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో 50 వేల మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను దిగుమతి చేసుకునేందుకు భారత్‌ ప్రణాళికలు తయారు చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని