
Jabalpur: రన్‌వే నుంచి పక్కకు వెళ్లిన విమానం.. ఇద్దరు పైలట్ల లైసెన్సులు రద్దు
దిల్లీ: మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ విమానాశ్రయంలో మార్చి 12న జరిగిన ప్రమాదంపై పౌర విమానయానశాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) చర్యలు చేపట్టింది. ఆ విమానం నడిపిన ఇద్దరు పైలట్లపై వేటువేస్తూ ఏడాదిపాటు వారి లైసెన్సులను రద్దుచేసింది. 55 మంది ప్రయాణికులతో దిల్లీ నుంచి బయల్దేరిన అలయన్స్ ఎయిర్ ఏటీఆర్-72 విమానం జబల్పూర్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతూ రన్‌వే నుంచి పక్కకు వెళ్లిపోయింది. అదృష్టవశాత్తూ ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. జబల్పూర్ విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో విమానం చాలాసేపు ఎగురుతూ ఎయిమింగ్ పాయింట్(టచ్‌డౌన్ పాయింట్)కు 900 మీటర్లు దూరంగా వెళ్లినట్లు విచారణలో తేలింది. ‘డీజీసీఏ విచారణ అనంతరం ఇద్దరు ఆపరేటింగ్ సిబ్బంది లైసెన్స్‌ను ఏడాది పాటు రద్దు చేసింది’ అని విమానయానశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
china: బీజింగ్, షాంఘైల్లో జీరో కోవిడ్ లక్ష్యం సాధించిన చైనా
-
General News
Mohan Babu: తిరుపతి కోర్టుకు నటుడు మోహన్‌బాబు
-
General News
Ts Inter results 2022: తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలదే హవా!
-
Sports News
IND vs ENG: కెప్టెన్సీకి పంత్ ఇంకా పరిపక్వత సాధించలేదు: పాక్ మాజీ క్రికెటర్
-
Politics News
Maharashtra: రెబల్స్‌లో సగం మంది మాతో టచ్‌లోనే..: సంజయ్ రౌత్
-
General News
Ts Inter results 2022: ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. క్లిక్ చేసి రిజల్ట్ చూసుకోండి..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- TS Inter Results 2022: తెలంగాణ ఇంటర్ ఫలితాలు..
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (28/06/2022)
- ఫలించిన ఎనిమిదేళ్ల తల్లి నిరీక్షణ: ‘ఈటీవీ’లో శ్రీదేవి డ్రామా కంపెనీ చూసి.. కుమార్తెను గుర్తించి..
- నాకు మంచి భార్య కావాలి!
- ఆవిష్కరణలకు అందలం
- ఔరా... అనేల
- IND vs ENG: బుమ్రాకు అరుదైన అవకాశం?
- TS INTER RESULTS 2022: మరికాసేపట్లో ఇంటర్ రిజల్ట్స్.. ఫలితాలు ఈనాడు.నెట్లో చూడొచ్చు
- Ts Inter results 2022: ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. క్లిక్ చేసి రిజల్ట్ చూసుకోండి..
- Viveka Murder Case: శివశంకర్‌రెడ్డిదే కీలక పాత్ర