Updated : 11 Aug 2022 13:37 IST

Jagdeep Dhankhar: భారత 14వ ఉపరాష్ట్రపతిగా జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ ప్రమాణ స్వీకారం

దిల్లీ: భారత 14వ ఉపరాష్ట్రపతిగా జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ (Jagdeep Dhankhar) ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ను ప్రముఖులు అభినందించారు.

ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌.. అంతకుముందు పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌గా పని చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో (Vice President Election) అధికార ఎన్డీయే కూటమి ఆయనను తమ అభ్యర్థిగా రంగంలోకి దింపింది. విపక్షాల అభ్యర్థి మార్గరెట్‌ ఆళ్వా (Margaret Alva)పై 346 ఓట్ల తేడాతో జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ విజయం సాధించారు.

అంతకుముందు రాజ్‌ఘాట్‌ను సందర్శించిన జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌.. బాపూజీ సమాధికి నివాళులు అర్పించారు. మహాత్మా గాంధీ స్ఫూర్తి, ఆశీస్సులతో భారతమాత సేవలో కొనసాగుతానని పేర్కొంటూ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ ట్వీట్‌ చేశారు.


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని