Sukesh- Jacqueline: ‘నా బుట్టబొమ్మ జాక్వెలిన్‌కు’.. జైలు నుంచి సుకేశ్ మరో ప్రేమ లేఖ

నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ (Jacqueline Fernandez)కు ఆర్థిన నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్‌ జైలు నుంచి మరోసారి ప్రేమ సందేశాన్ని పంపాడు.

Published : 25 Mar 2023 17:18 IST

దిల్లీ: జైలు నుంచే అక్రమాలకు పాల్పడిన ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్‌ (Sukesh Chandrashekhar).. తన సన్నిహతురాలు, సినీ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ (Jacqueline Fernandez)కు మరో ప్రేమ లేఖ రాశాడు. సుకేశ్ తన పుట్టినరోజు సందర్భంగా జైలు నుంచే ఆమెకు ఈ సందేశాన్ని పంపాడు. నటిపై తనుకున్న ప్రేమను వ్యక్తపరుస్తూ అతడు రాసిన ఈ లేఖ వార్త ఇప్పుడు జాతీయ మీడియాలో వైరల్‌గా మారింది.

‘‘మై బేబీ జాక్వెలిన్‌ (Jacqueline Fernandez). నా పుట్టినరోజున నిన్ను చాలా మిస్‌ అవుతున్నా. నీ మాటలను, నీ ఎనర్జీని ఎంతగానో మిస్‌ అవుతున్నా. కానీ, నా మీద నీకున్న ప్రేమ అనంతమని, ఎన్నటికీ తరగదని నాకు తెలుసు. నీ అందమైన హృదయంలో ఏముందో నాకు తెలుసు. దానికి రుజువులు అక్కర్లేదు. నా జీవితంలో వెలకట్టలేని అత్యంత విలువైన కానుక నువ్వు. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నా బుట్టబొమ్మ’’ అని సుకేశ్ (Sukesh Chandrashekhar) ఆ లేఖలో రాసుకొచ్చాడు. కాగా.. ఇటీవల హోలీ సందర్భంగా సుకేశ్.. నటికి ఇలాంటి ప్రేమ సందేశాన్నే పంపిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి: జైలు నుంచి జాక్వెలిన్‌కు హోలీ సందేశం..!

దాదాపు రూ.200కోట్ల మనీలాండరింగ్‌ కేసులో ప్రధాన నిందితుడైన సుకేశ్ (Sukesh Chandrashekar) నుంచి జాక్వెలిన్‌ (Jacqueline Fernandez)కు ఖరీదైన బహుమతులు అందుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో దర్యాప్తు చేపట్టిన ఈడీ.. ఈ కేసులో ఆమెను నిందితురాలిగా పేర్కొంది. ఈ కేసులో ఆమెను పలుమార్లు విచారించింది కూడా. అయితే సుకేశ్ తన జీవితాన్ని నరకప్రాయం చేశాడని జాక్వెలిన్‌ ఇటీవల వాపోయింది. అతడు తన జీవితంతో ఆడుకొని కెరీర్‌ను, జీవనోపాధిని నాశనం చేశాడని న్యాయస్థానం ఎదుట వాంగ్మూలం ఇచ్చింది. హోంశాఖలో ఓ ముఖ్య అధికారిగా సుఖేశ్‌ తనను తాను పరిచయం చేసుకున్నట్లు తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని