Satyendar Jain: జైలు సీసీటీవీ దృశ్యాలు లీక్‌.. కోర్టును ఆశ్రయించిన జైన్‌

ఇటీవల జైల్లో జైన్ మర్దనా చేయించుకుంటున్న వీడియోతో పాటు ఆయన ఆహారానికి సంబంధించిన దృశ్యాలు బయటకు వచ్చాయి. వీటిపై ఆయన కోర్టును ఆశ్రయించారు.

Published : 24 Nov 2022 02:10 IST

దిల్లీ: ప్రస్తుతం తిహాడ్ జైల్లో ఉన్న ఆప్‌ నేత, దిల్లీ మంత్రి సత్యేందర్ జైన్‌కు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. మీడియాలో ఈ వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. అక్కడ ఆయన ప్రత్యేక సేవలు పొందుతున్నట్లు వాటిలో కనిపిస్తోందని భాజపా విమర్శలు గుప్పిస్తోంది. అయితే వాటిని ప్రచురించకుండా అడ్డుకోవాలని జైన్‌.. సీబీఐ కోర్టును ఆశ్రయించారు. అంతేకాకుండా అసలు ఈ వీడియోలు ఎలా లీక్‌ అయ్యాయో తెలుసుకునేందుకు విచారణకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. 

ఇటీవల జైలులో జైన్ మర్దన చేయించుకుంటున్న వీడియోతో పాటు ఆయన ఆహారానికి సంబంధించిన దృశ్యాలు బయటకు వచ్చాయి. మంత్రికి మర్దన చేస్తున్న వ్యక్తి ఫిజియోథెరపిస్టు కాదు..  ఓ రేపిస్ట్‌ అంటూ జైలు వర్గాలు వెల్లడించాయి. దీంతో ఇవన్నీ భాజపాకు అస్త్రంగా మారాయి. దిల్లీ మున్సిపల్ ఎన్నికలు, గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ వ్యవహారం ఆప్‌ను ఇరకాటంలోకి నెట్టింది. ఆయన వైద్యులు చెప్పిన ప్రకారమే చికిత్స పొందుతున్నారని, తన మత విశ్వాసాల ఆధారంగానే ఆహారం తీసుకుంటున్నారంటూ ఆ విమర్శలను ఆప్‌ తిప్పికొడుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని