Afghanistan: కాబుల్‌లో  జైషే, లష్కరే ఉగ్రవాదుల తిష్ట

తాలిబన్ల నాయకత్వంలో అఫ్గానిస్థాన్‌ ఇతర ముష్కరమూకలకు కేంద్రంగా మారొచ్చని అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉంది. వాటిని నిజం చేస్తూ కొన్ని

Published : 17 Aug 2021 18:40 IST

కాబుల్: తాలిబన్ల నాయకత్వంలో అఫ్గానిస్థాన్‌ ఇతర ముష్కరమూకలకు కేంద్రంగా మారొచ్చని అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉంది. వాటిని నిజం చేస్తూ కొన్ని ఉగ్రవాద సంస్థలకు చెందిన సభ్యులు ఇప్పటికే ఆ దేశంలో తిష్ట వేసినట్లు సమాచారం. ఇస్లామిక్‌ స్టేట్‌, జైషే మహ్మద్‌, లష్కరే తోయిబా ఉగ్రవాదులు దేశ రాజధాని కాబుల్‌లోకి చొరబడినట్లు కొన్ని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. 

ఈ ముఠాలు కాబుల్‌లోని పలు ప్రాంతాల్లో ప్రత్యేకంగా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమచారం. కాగా.. వీరు రాజధానిలోనే ఉన్నట్లు తాలిబన్లకు కూడా తెలుసట. అయితే ఈ ముష్కరులు తాలిబన్ల నియంత్రణలో లేకపోవడంతో ఇప్పుడీ వ్యవహారం తాలిబన్లకు కొత్త సమస్యగా మారినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తాలిబన్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన ముల్లా మహ్మద్‌ ఒమర్‌ కుమారుడు ముల్లా యాకుబ్‌ క్వెట్టా(పాకిస్థాన్‌) నుంచి అఫ్గాన్‌ వచ్చినట్లు సమాచారం. కాబుల్‌లో విదేశీ గ్రూపులు తిష్ట వేయకుండా చూసుకునేందుకే యూకుబ్‌ వచ్చి ఉంటాడనే వార్తలు వినిపిస్తున్నాయి. 

తాలిబన్లు, అమెరికా మధ్య జరిగిన శాంతి ఒప్పందం ప్రకారం.. తాలిబన్లు అఫ్గాన్‌లో ఇతర ఉగ్రముఠాలను రానివ్వకూడదు. ఆ ఒప్పందాన్ని తాలిబన్లు పాటిస్తే గనుక రానున్న రోజుల్లో జైషే, లష్కరే ముఠాలను దేశం నుంచి పంపివేసే అవకాశాలున్నట్లు సమాచారం. అంతేగాక, విదేశీ ఉగ్రవాద సంస్థలుంటే వారితో తాలిబన్లకు ఘర్షణలు జరిగే అవకాశం కూడా ఉంది.  అందుకే వాటిని తరిమికొట్టాలని తాలిబన్లు భావిస్తున్నట్లు సమాచారం. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని