Jaishankar: ‘ఆ సమయంలో అటల్‌ దౌత్యనీతి భేష్‌!’

పోఖ్రాన్‌ అణు పరీక్షల అనంతరం అప్పటి ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ దౌత్యనీతిని భారత్‌ విదేశాంగ మంత్రి జైశంకర్‌ కొనియాడారు. దిల్లీలో నిర్వహించిన ‘అటల్ బిహారీ వాజ్‌పేయీ మూడో స్మారక ఉపన్యాస’ కార్యక్రమానికి జైశంకర్‌ అధ్యక్షత వహించి ప్రసంగించారు.

Published : 24 Jan 2023 01:19 IST

దిల్లీ: భారత్‌లో 1998 అణుపరీక్షల(Pokhran Nuclear Tests) అనంతరం దౌత్య కార్యకలాపాల(Diplomacy)ను అప్పటి ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ(Atal Bihari Vajpayee) సమర్థంగా నిర్వహించారని విదేశాంగశాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ కొనియాడారు. కేవలం రెండేళ్ల వ్యవధిలోనే భారత్‌ ప్రపంచంలోని అన్ని ప్రధాన దేశాలతో తన సంబంధాలను పునరుద్ధరించుకుందని గుర్తుచేశారు. దిల్లీలో నిర్వహించిన ‘అటల్ బిహారీ వాజ్‌పేయీ మూడో స్మారక ఉపన్యాస’ కార్యక్రమానికి జైశంకర్‌ అధ్యక్షత వహించి ప్రసంగించారు. విదేశాంగ మంత్రిగా వాజ్‌పేయీ కార్యదక్షతను, అమెరికా, రష్యాలతో భారత్‌ సంబంధాలను బలోపేతం చేయడంలో ఆయన పాత్రను ప్రశంసించారు.

ఇప్పుడు చైనాతో మాట్లాడుతున్నట్లు.. పరస్పర గౌరవం, పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన మౌలికాంశాల విషయంలో చాలా వరకు క్రెడిట్‌ వాజ్‌పేయీకి దక్కుతుందని జైశంకర్‌ అన్నారు. ‘కేవలం 1998 నాటి పోఖ్రాన్ అణు పరీక్షలను చూడొద్దు. ఆ తర్వాత అనుసరించిన దౌత్యనీతినీ పరిశీలించాలి. అణు పరీక్షల తర్వాత రెండేళ్ల వ్యవధిలో ప్రపంచంలోని అన్ని ప్రధాన దేశాలతో సంబంధాలు పునరుద్ధరించుకున్నాం. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ఆస్ట్రేలియా మాజీ ప్రధాని జాన్ హోవార్డ్, జపాన్‌ పీఎం యోషిరో మోరీ, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు జాక్వెస్ చిరాక్ తదితరులు భారత్‌ను సందర్శించారు. దౌత్యరంగంలో ఉన్న ఎవరైనా అప్పట్లో భారత్‌ దౌత్యనీతిని చూసి పాఠాలు నేర్చుకోవాలని భావిస్తున్నా’ అని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని