S Jaishankar: సుష్మపై పాంపియో వ్యాఖ్యలు.. తీవ్రంగా ఖండించిన జై శంకర్
మాజీ కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్‌ను ఉద్దేశించి అమెరికా మాజీ మంత్రి మైక్ పాంపియో తీవ్ర పదజాలం ఉపయోగించారు. దీనిని విదేశాంగ మంత్రి జై శంకర్(S Jaishankar) తీవ్రంగా ఖండించారు.
దిల్లీ: తన తాజా పుస్తకంలో భారత మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్(Sushma Swaraj)ను ఉద్దేశించి అమెరికా మాజీ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో(Mike Pompeo) అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. దీనిపై కేంద్రమంత్రి ఎస్ జై శంకర్(S Jaishankar) నుంచి తీవ్రస్థాయి స్పందన వచ్చింది. ఆమెను ప్రస్తావిస్తూ ఉపయోగించిన పదజాలాన్ని ఖండించారు.
‘నెవర్ గివ్ యాన్ ఇంచ్: ఫైటింగ్ ఫర్ ది అమెరికా ఐ లవ్’ పేరుతో రచించిన తాజా పుస్తకంలో పాంపియో పలు విషయాలపై తన అభిప్రాయాలు వెల్లడించారు. తానెప్పుడు సుష్మా స్వరాజ్(Sushma Swaraj)ను ముఖ్యమైన రాజకీయ నేతగా చూడలేదని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో అభ్యంతర పదజాలం వాడారు. అలాగే ప్రస్తుత కేంద్రమంత్రి జై శంకర్ పనితీరును ప్రశంసించారు. తాను చెప్పిన విషయాలను ఆయన కూడా అంగీకరించినట్లు పాంపియో చెప్పగా.. మంత్రి ఆ వ్యాఖ్యలను ఖండించారు.
‘సుష్మా స్వరాజ్‌ను ఉద్దేశిస్తూ పాంపియో రాసిన వాక్యాలను నేను చూశాను. నేను ఎప్పుడూ ఆమెతో ఎంతో గౌరవంగా ఉన్నాను. ఆమెతో నాకు అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. ఆమెపై ఉపయోగించిన పదజాలాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను’ అని జై శంకర్ తీవ్రంగా స్పందించారు.
పాంపియోకు ట్రంప్ సన్నిహితుడనే పేరుంది. 2017-18 కాలంలో ఆయన సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ(CIA) డైరెక్టర్‌గా పనిచేశారు. 2018 నుంచి 2021 మధ్యకాలంలో విదేశాంగ శాఖ బాధ్యతలు నిర్వహించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Zelensky: ‘జెలెన్స్కీని చంపబోమని పుతిన్ హామీ ఇచ్చారు!’
-
India News
American Airlines: సాయం కోరినందుకు క్యాన్సర్ రోగిని విమానం నుంచి దించేసిన సిబ్బంది!
-
Sports News
Cheteshwar Pujara: నా కెరీర్లో అత్యుత్తమ సిరీస్ అదే: ఛెతేశ్వర్ పుజారా
-
Crime News
Cyber Crime: ఈ-కామర్స్ ఓటీపీ పేరుతో కొత్త పంథాలో సైబర్ మోసం!
-
Movies News
Social Look: వేదిక అలా.. మౌనీరాయ్ ఇలా.. శ్రద్ధాకపూర్?
-
General News
Anand Mahindra: కంపెనీలు ఇలాంటి ఉత్పత్తులను తయారు చేయాలి!