విశ్వం గుట్టు విప్పేందుకు.. నింగిలోకి దూసుకెళ్లిన జేమ్స్‌ వెబ్‌స్పేస్‌ టెలిస్కోప్‌

ఖగోళ శాస్త్రంలో అంతులేని ప్రశ్నలకు జవాబులు కనుగోనే దిశగా మరో ముందడుగు పడింది. విశ్వం గుట్టు ఛేదించేందుకు జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోపు (జేడబ్ల్యూఎస్‌టీ)ను ప్రయాణం ప్రారంభమైంది.

Updated : 25 Dec 2021 18:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఖగోళ శాస్త్రంలో అంతులేని ప్రశ్నలకు జవాబులు కనుగోనే దిశగా మరో ముందడుగు పడింది. విశ్వం గుట్టు ఛేదించేందుకు జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోపు (జేడబ్ల్యూఎస్‌టీ)ను ప్రయాణం ప్రారంభమైంది. ఫ్రెంచ్‌ గయానా అంతరిక్ష కేంద్రం నుంచి భారత కాలమానం ప్రకారం సరిగ్గా శనివారం సాయంత్రం 5.50 గంటలకు ఎరియాన్‌-5 రాకెట్‌ దీన్ని విజయవంతంగా నింగిలోకి మోసుకెళ్లింది. 5 నుంచి 10 ఏళ్ల పాటు ఈ టెలిస్కోప్‌ సేవలందించనుంది. రూ.73 వేల కోట్ల వ్యయంతో అమెరికా, ఐరోపా, కెనడా అంతరిక్ష పరిశోధన సంస్థలు సంయుక్తంగా దీన్ని రూపొందించాయి.

వినూత్న పరిజ్ఞానం, భారీ వ్యయ ప్రయాసలతో రూపొందిన ఈ అత్యాధునిక టెలిస్కోపు అందించబోయే డేటా, వెలుగులోకి తెచ్చే సరికొత్త విషయాల గురించి ప్రపంచవ్యాప్తంగా ఖగోళ శాస్త్రవేత్తలు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పరిశోధనల కోసం ఒక కొత్త రంగాన్ని తీసుకొచ్చే సామర్థ్యం ఈ ప్రయోగానికి ఉందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. 1990లో ప్రయోగించిన హబుల్‌ స్పేస్‌ టెలిస్కోపు విశ్వానికి సంబంధించిన అనేక నిగూఢ వివరాలను అందించింది. దాని వారసురాలిగా జేడబ్ల్యూఎస్‌టీని చెప్పుకోవచ్చు. నింగిలోకి దూసుకెళ్లిన ఈ టెలిస్కోప్‌ వివిధ దశలను దాటుకుని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశించడానికి దాదాపు నెల రోజుల సమయం పడుతుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని