జమ్ము కశ్మీర్‌లో పాఠశాలలు బంద్ 

రోనా మహమ్మారి మళ్లీ బుసలు కొడుతోంది. వివిధ రాష్ట్రాలు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాయి. కొద్ది రోజులుగా

Published : 04 Apr 2021 16:48 IST

శ్రీనగర్‌: కరోనా మహమ్మారి మళ్లీ బుసలు కొడుతోంది. వివిధ రాష్ట్రాలు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాయి. కొద్ది రోజులుగా జమ్మూ కశ్మీర్‌లో కొవిడ్‌-19 కేసులు పెరుగుతున్నాయి. శనివారం ఒక్కరోజే 501 కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దాంతో విద్యార్థుల, ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడి ప్రభుత్వం కూడా పాఠశాలలు మూసివేయాలనే నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌ 5 నుంచి 18 వరకూ పాఠశాలలు, ఒక వారం పాటు 10 నుంచి 12 భౌతిక తరగతులు నిలిపేస్తున్నట్లు ఆదివారం ఉదయం లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా కార్యాలయం ట్విటర్‌ ద్వారా తెలియజేసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని