J&K: సాధారణ స్థితికి వచ్చాకే రాష్ట్ర హోదా..!

పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాకే జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు రాజ్యసభలో శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది

Updated : 13 May 2022 16:28 IST

దిల్లీ: పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాకే జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు రాజ్యసభలో శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది లేవనెత్తిన ప్రశ్నకు హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్‌ రాయ్‌ బుధవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ని 2019 ఆగస్టు 5న రద్దు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం రాష్ట్రాన్ని ప్రభుత్వం జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది.

జమ్మూకశ్మీర్‌లో భద్రతాపరమైన అంశాలపై బిజద ఎంపీ సస్మిత్‌ పాత్రా అడిగిన ప్రశ్నకు నిత్యానంద్‌ రాయ్‌ లిఖితపూర్వకంగా బదులిచ్చారు. 2019తో పోలిస్తే అక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు.. 2020లో 59 శాతం, ఈ ఏడాది జూన్‌ నాటికి 32 శాతం తగ్గినట్లు వెల్లడించారు. ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అందులో భాగంగా భద్రతను పెంచడం, ఉగ్రముఠాలు విసురుతున్న సవాళ్లను సమర్థంగా తిప్పికొట్టేందుకు గాలింపు చర్యలను తీవ్రతరం చేయడం లాంటి ముందస్తు జాగ్రత్తలను తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఉగ్రముఠాలకు సహకరిస్తున్న వ్యక్తులపైనా నిఘా పెట్టినట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో కశ్మీరీ పండిట్ల పునరావాసానికి సంబంధించిన అంశంపైనా హోంశాఖ స్పందించింది. ప్రస్తుతం అక్కడ కశ్మీరీ పండిట్లు సహా డోగ్రా వర్గానికి చెందిన  900 కుటుంబాలు నివసిస్తున్నట్లు పేర్కొంది. వారి భద్రతకు ప్రభుత్వం అన్నిచర్యలూ చేపడుతున్నట్లు వివరించింది. 

 


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని