japan: నిబంధన ఉల్లంఘించారా.. మీ పేర్లు బయటపెడతాం!

కరోనా కట్టడి కోసం అన్ని దేశాలు కఠిన కొవిడ్‌ నిబంధనలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. విదేశాల నుంచి వచ్చే వారిపై మరింత దృష్టి సారించాయి. దేశంలోకి అడుగుపెట్టిన మరుక్షణం నుంచే కొన్నిరోజులు క్వారంటైన్‌లో ఉండాలని సూచిస్తున్నాయి. అయినా, కొందరు నకిలీ కరోనా రిపోర్టులు చూపించి, అధికారుల కళ్లుగప్పి నిబంధనలను

Published : 04 Aug 2021 01:38 IST

ప్రజలకు జపాన్‌ ప్రభుత్వం హెచ్చరిక

టోక్యో: కరోనా కట్టడి కోసం అన్ని దేశాలు కఠిన కొవిడ్‌ నిబంధనలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. విదేశాల నుంచి వచ్చే వారిపై మరింత దృష్టి సారించాయి. దేశంలోకి అడుగుపెట్టిన మరుక్షణం నుంచే కొన్నిరోజులు క్వారంటైన్‌లో ఉండాలని సూచిస్తున్నాయి. అయినా, కొందరు నకిలీ కరోనా రిపోర్టులు చూపించి, అధికారుల కళ్లుగప్పి నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ఇలాంటి పరిస్థితే జపాన్‌ ప్రభుత్వానికి ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో జపాన్‌ ప్రజల వ్యక్తిగత భద్రతకు భంగం కలిగేదే అయినా.. అక్కడి ప్రభుత్వం ఒక కఠిన నిర్ణయాన్ని తీసుకుంది. విదేశాల నుంచే వ్యక్తులు ఎవరైనా కొవిడ్‌ నిబంధనలు పాటించకపోతే వారి వివరాలను బయటపెడుతామని ప్రకటించింది. తాజాగా ముగ్గురు వ్యక్తులు విదేశానికి వెళ్లి వచ్చి.. అధికారులకు సమాచారం ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నారట. దీంతో వారి వివరాలను జపాన్‌ ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో వారు ఎవరై ఉంటారా అని నెటిజన్లు సోషల్‌మీడియాలో వెతకడం మొదలుపెట్టారు. దీంతో నిబంధనలు ఉల్లంఘించిన వారికి అపరాధభావం కలుగుతుందని, మరోసారి ఇలా నిబంధనలు ఉల్లంఘించరని ప్రభుత్వం భావిస్తోంది.

కరోనా కట్టడిలో భాగంగా విదేశాల నుంచి వచ్చే ప్రయాణికును కనీసం రెండు వారాలు క్వారంటైన్‌లో ఉండాలని జపాన్‌ ప్రభుత్వం సూచిస్తోంది. అలాగే, స్మార్ట్‌ఫోన్‌లో ట్రాకింగ్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని, ఆరోగ్య పరిస్థితిని యాప్‌లో పొందుపర్చాలని కోరుతోంది. జపాన్‌లో ఇప్పటివరకు 9.35లక్షల కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం 77,909 యాక్టివ్‌ కేసులున్నాయి. మరోవైపు దేశ రాజధాని టోక్యోలో ఒలింపిక్స్‌ జరుగుతున్న నేపథ్యంలో అధికారులు ఆ ప్రాంతంలో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించి మరి ఆరోగ్య భద్రతను కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అయినా.. ఒలింపిక్స్‌ గ్రామంలో 200లకు పైగా కరోనా కేసులు నమోదుకావడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని