గల్లంతైన భార్య కోసం పదేళ్లుగా అన్వేషణ!
జపాన్‌లో విధ్వంసం సృష్టించిన భూకంపం.. సునామీ విపత్తుకు నిన్నటితో దశాబ్దం. పదేళ్ల కిందట అంటే 2011 మార్చి 11న తోహోకు ప్రాంతంలో సంభవించిన భూకంపం జపాన్ను వణికించగా.. దాని కారణంగా పుట్టుకొచ్చిన సునామీ ఆ దేశాన్ని వరదలతో ముంచేసింది. ఈ ప్రకృతి విపత్తులో
ఇంటర్నెట్ డెస్క్: జపాన్‌లో విధ్వంసం సృష్టించిన భూకంపం.. సునామీ విపత్తుకు నిన్నటితో దశాబ్దం. పదేళ్ల కిందట అంటే 2011 మార్చి 11న తోహోకు ప్రాంతంలో సంభవించిన భూకంపం జపాన్ను వణికించగా.. దాని కారణంగా పుట్టుకొచ్చిన సునామీ ఆ దేశాన్ని వరదలతో ముంచేసింది. ఈ ప్రకృతి విపత్తులో 15వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశానికి రూ.లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. వరదల్లో గల్లంతైన వారి కోసం ప్రభుత్వం ఎంతగానో అన్వేషించింది. కొందరి మృతదేహాలు లభ్యం కాగా.. ఇప్పటికీ దాదాపు 2,500మందికిపైగా ఆచూకీ తెలియలేదు. వారిలో యాసు టకామాత్సు భార్య యూకు కూడా ఉంది. వెతికి వేసారి ప్రభుత్వం వారిని మరణించినట్లు ప్రకటించినా 64 ఏళ్ల టకామాత్సు మాత్రం పదేళ్లుగా తన అర్ధాంగి జాడ కోసం అన్వేషిస్తూనే ఉన్నాడు. ఆమె చనిపోయినా.. మృతదేహామైన దొరక్కపోదా? చివరి చూపు అయినా చూసుకోకపోతానా? అనే ఆశాభావంతో.. అంతులేని ఆవేదనతో సముద్రాన్ని జల్లెడ పడుతున్నాడు.
జపాన్‌కు తీవ్ర వేదన మిగిల్చిన ఆ భూకంపం తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 9గా నమోదైంది. ఈ భూకంప ప్రభావంతో సునామీ జపాన్‌పై విరుచుకుపడింది. ఈ క్రమంలో ఒనగావా ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయి. ఆ వరదల్లో టకామాత్సు సతీమణి యూకు కొట్టుకుపోయింది. సునామీ ప్రభావం తగ్గిన తర్వాత రెస్క్యూ సిబ్బంది గల్లంతైన వారి కోసం వెతకటం మొదలుపెట్టింది. కానీ, యూకు జాడ లభించలేదు. కొన్నిరోజులకు ప్రభుత్వం సహాయకచర్యలు నిలిపివేసింది. దీంతో స్వయంగా తనే ఎలాగైనా తన భార్య ఆచూకీ కనిపెట్టాలని టకామాత్సు నిర్ణయించుకున్నాడు.
పర్వతాలు.. అడవులు.. ఆపై సముద్రం
వరదల్లో కొట్టుకుపోయే ముందు చివరిసారిగా యూకు ఎక్కడ ఉందో ఆ చోటుకు సమీపంలో ఉన్న పర్వతాలు, అడవులు అన్నింటిని ఏడాదిన్నర పాటు టకామాత్సు గాలించాడు. అయినా, యూకు ఆచూకీ దొరకలేదు. ఇక వెతకడానికి మిగిలింది సముద్రమే. అందుకే సముద్రంలో లోతుగా వెళ్లి వెతకడానికి వీలుగా డైవింగ్ నేర్చుకున్నాడు. కొన్ని నెలల పాటు కఠోర శిక్షణ తీసుకొని డైవింగ్‌లో నైపుణ్యం సాధించాడు. అప్పటి నుంచి వారాంతాల్లో సముద్రంలో దూకి తన భార్య కోసం అన్వేషిస్తున్నాడు. ఇప్పటి వరకు దాదాపు 500సార్లు డైవింగ్ చేశాడట. అతడు ఏయే ప్రాంతాలను వెతికాడు, ఎంత లోతులో వెతికాడు, ఇంకా ఏయే ప్రాంతాలను వెతకాలి వంటి విషయాలను డైవింగ్ ట్రైనర్ రికార్డు చేస్తున్నాడు. ఈ అన్వేషణలో గల్లంతైన ఎంతో మంది వస్తువులు దొరుకుతున్నాయి. కానీ, యూకుకి సంబంధించిన చిన్న ఆధారం కూడా లభించట్లేదు. అయినా సరే, తన శరీరం సహకరించినంత వరకు, కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తన భార్య కోసం అన్వేషణ కొనసాగిస్తూనే ఉంటానని స్పష్టం చేస్తున్నాడు. టకామాత్సు సంకల్పం నెరవేరాలని ఆయన గురించి తెలిసిన వ్యక్తులు కాంక్షిస్తున్నారు. గల్లంతై బతికుందో లేదో తెలియని భార్య ఆచూకీ కోసం తాపత్రయపడతున్న భర్త ప్రేమ ఎంత గొప్పదో కదా..!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
మన దేశ ఎన్నికలపై విదేశీ మీడియా స్పందించడానికి గల కారణాన్ని కేంద్రమంత్రి జై శంకర్ (S Jaishankar) వెల్లడించారు. -
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
శామ్ పిట్రోడా (Sam Pitroda) తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని వివాదంలోకి నెట్టారు. దాంతో ఇప్పుడు హస్తం పార్టీ వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. -
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
Patanjali: సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో పతంజలి సంస్థ మరోసారి వార్తాపత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు తెలియజేసింది. నిన్నటితో పోలిస్తే మరింత పెద్ద సైజులో ఈ ప్రకటనలు ఇచ్చింది. -
గోరఖ్‌పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్ లోక్‌సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్‌పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్‌ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్‌కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్‌కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్‌కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్‌ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
జగన్‌పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
-
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్‌పై బిగ్‌బాస్ నటి ఆగ్రహం
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్‌నవూ సెంచరీ హీరో