విమానయాన రంగం కొత్తపుంతలు: ‘జపాన్‌’ మిస్టరీ డెస్టినేషన్‌!

కరోనా.. లాక్‌డౌన్‌ సమయంలో దాదాపు అన్ని సేవలు మూతపడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రయాణాలను నిషేధించడంతో విమానయానరంగం కూడా కుంటుపడింది. జపాన్‌లోనూ అదే పరిస్థితి. ఇటీవల తిరిగి విమాన సేవలకు అనుమతులు రావడంతో అక్కడి ప్రజలు విహారయాత్రలకు వెళ్లడానికి

Updated : 20 Oct 2021 19:40 IST

 

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా.. లాక్‌డౌన్‌ సమయంలో దాదాపు అన్ని సేవలు మూతపడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రయాణాలను నిషేధించడంతో విమానయానరంగం కూడా కుంటుపడింది. జపాన్‌లోనూ అదే పరిస్థితి. ఇటీవల తిరిగి విమాన సేవలకు అనుమతులు రావడంతో అక్కడి ప్రజలు విహారయాత్రలకు వెళ్లడానికి సిద్ధపడుతున్నారట. దీంతో విమానయానరంగానికి, పర్యటక రంగానికి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు అక్కడి పీచ్‌ ఏవియేషన్‌ సంస్థ.. ‘మిస్టరీ డెస్టినేషన్‌’ పేరుతో వినూత్న ప్రయత్నం చేస్తోంది. అదేంటంటే..

కొంతమందికి విహాయరయాత్రకు వెళ్లాలని ఉన్నా.. ఎక్కడికి వెళ్లాలో తెలియక తికమకపడుతుంటారు. అలాంటి వారే లక్ష్యంగా సరికొత్త టికెట్‌ వెండింగ్‌ మిషన్‌ను ఏర్పాటు చేసింది. పలు విమానాశ్రయాల్లో అందుబాటులో ఉన్న ఈ వెండింగ్‌ మిషన్‌లో చిన్న చిన్న ప్లాస్టిక్‌ బాల్స్‌ ఉంటాయి. ఒక్కో బాల్‌ లోపల విహారయాత్రలకు అనువుగా ఉండే సప్పొరో, సెండాయ్‌, నగోయా, ఫుకవొకా, కగోషిమా సహా వివిధ ప్రాంతాల పేరుతో టికెట్స్‌ పెట్టారు. ఒక్క బాల్‌ ధర 5వేల యెన్లు(రూ.3,285). పర్యటకులు ఈ బాల్‌ను కొనుగోలు చేసి.. దాన్ని ఓపెన్‌ చేస్తే అందులో సందర్శక ప్రాంతం పేరుతో టికెట్‌ కనిపిస్తుంది. అప్పటికప్పుడు ఆ ప్రాంతానికి వెళ్లే విమానం ఎక్కేయడమే తరువాయి. టికెట్‌తోపాటు కొన్ని రివార్డు పాయింట్లు కూడా లభిస్తాయి. ఈ ఆఫర్‌ను దేశీయ పర్యటనను ప్రోత్సహించడంలో భాగంగానే అందిస్తున్నామని పీచ్‌ ఏవియేషన్‌ సంస్థ చెబుతోంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని