జోకర్‌ వేషంలో వచ్చి దాడి: 17 మందికి గాయాలు

టోక్యోలోని ఒక రైలులో జోకర్‌ వేషం వేసుకొచ్చిన ఓ గుర్తుతెలియని వ్యక్తి దాడి చేసి 17 మందిని గాయపర్చాడు.  ప్రజలందరూ నగరంలోని హాలోవిన్‌ పార్టీలకు బయల్దేరిన సమయంలో

Published : 01 Nov 2021 17:34 IST

 

ఇంటర్నెట్‌డెస్క్‌: జపాన్‌ రాజధాని టోక్యోలోని ఒక రైలులో జోకర్‌ వేషం వేసుకొచ్చిన ఓ గుర్తుతెలియని వ్యక్తి దాడి చేసి 17 మందిని గాయపర్చాడు.  ప్రయాణికులు నగరంలోని హాలోవిన్‌ పార్టీలకు బయల్దేరిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. ఊదా, ఆకుపచ్చ రంగు సూటు వేసుకొన్న వ్యక్తి ఒక కత్తి పట్టుకొని వచ్చి రైలులోని ప్రయాణికులపై దాడి చేశాడు. అనంతరం రైలు బోగీలో ఒక ద్రవాన్ని చల్లి నిప్పు పెట్టాడు. తొలుత ప్రజలు ఇదంతా హాలోవిన్‌ పార్టీలో భాగమని భ్రమించారు. ఈ ఘటన జపాన్‌ కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో కొక్రయూ స్టేషన్‌లో చోటు చేసుకొంది. 

నిందితుడిని పోలీసులు వెంటనే అరెస్టు చేసినట్లు సమాచారం. నిందితుడికి బ్యాట్‌మన్‌ సినిమాలో జోకర్‌ పాత్ర ఇష్టమని పోలీసులు చెప్పినట్లు క్యోడో న్యూస్‌ ఔట్‌లెట్‌ పేర్కొంది. అతడు అక్కడి వారిని చంపి మరణ శిక్ష పొందాలని భావించినట్లు స్థానిక పత్రికలు పేర్కొన్నాయి. అతని దాడిలో గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. 2019లో జోక్విన్‌ ఫోనిక్స్‌ నటించిన ‘జోకర్‌’ చిత్రంలో ఇదే విధంగా రైల్లో దాడి చేసిన సన్నివేశాలు ఉన్నాయి. నిందితుడు వాటిని అనుకరించే ప్రయత్నం చేశాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని