JEE Main 2023: జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల జయభేరి!
జేఈఈ మెయిన్ తొలి విడత ఫలితాల్లో (JEE main 2023) Results) తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. 100 పర్సంటైల్ సాధించిన 20మంది విద్యార్థుల్లో ఐదుగురు మన తెలుగు విద్యార్థులే ఉండటం విశేషం.
దిల్లీ: దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించిన జేఈఈ మెయిన్ తొలి విడత ఫలితాల్లో(JEE main 2023 Results) తెలుగు రాష్ట్రాల విద్యార్థులు విజయ ఢంకా మోగించారు. ఎన్‌టీఏ(NTA) విడుదల చేసిన పేపర్ -1 (బీఈ/బీటెక్) ఫలితాల్లో టాప్ -20 విద్యార్థుల జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులే ఐదుగురు ఉన్నారు. దేశవ్యాప్తంగా 20మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించగా.. ఆ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన
వావిలాల చిద్విలాస్ రెడ్డి, దుగ్గినేని వెంకట యుగేశ్, గుత్తికొండ అభిరామ్, బిక్కిన అభినవ్ చౌదరి, అభినీత్ మాజేటి నిలిచి తమ సత్తాను చాటుకున్నారు.
20మందికి 100 పర్సంటైల్.. టాపర్ల జాబితా ఇదే..
ఈ ఏడాది జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు వివిధ తేదీల్లో జరిగిన జేఈఈ మెయిన్- 2023 తొలి విడత పరీక్షలు రాసేందుకు దేశ వ్యాప్తంగా దాదాపు ఎనిమిదిన్నర లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరైన విషయం తెలిసిందే. ఏప్రిల్ 6 నుంచి 12వరకు జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు జరగనున్నాయి. తొలి విడత రాసిన విద్యార్థులు.. రెండో విడతకు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్ష తర్వాత ఎన్‌టీఏ ఆల్ ఇండియా ర్యాంకుల్ని ప్రకటిస్తుంది. ఆ తర్వాత విద్యార్థుల ప్రతిభ ఆధారంగా ప్రవేశాల ప్రక్రియను చేపట్టనున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Kamal Anand: రూ.60 కోసం పదేళ్లు పోరాటం
-
India News
Arvind Kejriwal: మోదీ విద్యార్హతపై అనుమానం పెరిగింది: కేజ్రీవాల్
-
Ts-top-news News
ఉదయం ప్రజాప్రతినిధి.. మధ్యాహ్నం కూలీ
-
India News
వెనుకా ముందు యువతులు.. బైక్పై ఆకతాయి చేష్టలు
-
Politics News
Ganta Srinivasa Rao: ఉత్తరాంధ్ర ప్రజలు రాజధానిని కోరుకోవడం లేదు: గంటా
-
India News
వింత ఘటన.. ఉల్లి కోసేందుకు వెళితే కళ్లలోంచి కీటకాల ధార