జైలునుంచి బయటకు రానున్న లాలూ

పశుగ్రాసం కుంభకోణం కేసులో రాష్ట్రీయ జనతా దళ్‌ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు ఎట్టకేలకు ఉపశమనం లభించింది. ఈ కుంభకోణానికి సంబంధించిన దుమ్కా ఖజానా కేసులోనూ

Published : 17 Apr 2021 14:43 IST

దుమ్కా ఖజానా కేసులో నేడు బెయిల్‌ మంజూరు

రాంచీ: పశుగ్రాసం కుంభకోణం కేసులో రాష్ట్రీయ జనతా దళ్‌ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు ఎట్టకేలకు ఉపశమనం లభించింది. ఈ కుంభకోణానికి సంబంధించిన దుమ్కా ఖజానా కేసులోనూ ఆయనకు బెయిల్‌ మంజూరైంది. దీంతో లాలూ జైలు నుంచి బయటకు వచ్చేందుకు మార్గం సుగమమైంది. 

1990లలో లాలూ బిహార్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన దాణా కుంభకోణంలో ఆయన దోషిగా తేలింది. దాంతో ఆయన 2017 నుంచి జైల్లో ఉన్నారు. దీనికి సంబంధించి లాలూపై మొత్తం నాలుగు కేసులు నమోదుకాగా.. ఇప్పటికే మూడు కేసుల్లో బెయిల్‌ మంజూరైంది. తాజాగా దుమ్కా ఖజానా కేసులో ఝార్ఖండ్‌ హైకోర్టు శనివారం బెయిల్‌ ఇచ్చింది. అయితే కోర్టు అనుమతి లేకుండా లాలూ దేశం విడిచి వెళ్లకూడదని న్యాయస్థానం ఆదేశించింది. అంతేగాక, బెయిల్‌ సమయంలో అడ్రసు, ఫోన్‌ నంబరు మార్చకూడదని స్పష్టం చేసింది. 

ప్రస్తుతం లాలూ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. రాంచీ జైలులో ఉన్నప్పటి నుంచి పలు రకాల వ్యాధులతో బాధపడుతున్న ఆయన.. తరచూ అనారోగ్యానికి గురయ్యారు. ఈ ఏడాది జనవరిలో ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో దిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. అప్పటి నుంచి ఆయన అక్కడే చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయితే లాలూ జైలు నుంచి ఇంటికి వెళ్లనున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని