Joe Biden: బైడెన్‌ పాలక వర్గంలో మరో భారతీయ అమెరికన్‌

అమెరికా అధ్యక్షుడు బైడెన్ పరిపాలన యంత్రాంగంలో మరో భారతీయ అమెరికన్‌కు స్థానం

Published : 31 Jul 2021 22:42 IST

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు బైడెన్ పరిపాలన యంత్రాంగంలో మరో భారతీయ అమెరికన్‌కు స్థానం లభించింది. అంతర్జాతీయ మత స్పేచ్ఛ సంస్థకు అమెరికా రాయబారిగా భారతీయ మూలాలున్న వ్యక్తిని బైడెన్ నామినేట్  చేశారు. ఇండో అమెరికన్ అయిన రషీద్ హుస్సేన్‌ను నామినేట్ చేసినట్లు శ్వేతసౌథం వెల్లడించింది. ప్రస్తుతం హుస్సేన్ అమెరికా జాతీయ భద్రతా మండలిలో ఓ విభాగానికి డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా అగ్రరాజ్య చరిత్రలో అంతర్జాతీయ మత స్వేచ్ఛ సంస్థకు నామినేట్ అయిన మొదటి ముస్లిం వ్యక్తి హుస్సేన్ అని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. బైడెన్ ప్రభుత్వం అన్ని మతాల వారి విశ్వాసాలకు తగిన ప్రాధాన్యం ఇస్తుందనడానికి ఇదే నిదర్శనమని వైట్‌ హౌస్‌ పేర్కొంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని