కరోనా టీకా తీసుకున్న జో బైడెన్‌

 అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ సోమవారం కరోనా టీకా తీసుకున్నారు. డెలవర్‌లోని క్రిస్టియానా ఆసుపత్రిలో 78 ఏళ్ల బైడెన్‌ ఫైజర్‌ టీకా మొదటి డోసు తీసుకున్నారు.  బైడెన్‌ వ్యాక్సినేషన్ ‌ఘట్టాన్ని అమెరికా ఛానళ్లు ప్రత్యక్షప్రసారం చేశాయి. టీకా తీసుకున్న సందర్భంగా బైడెన్‌ మాట్లాడుతూ.. ‘‘టీకా 

Updated : 22 Dec 2020 08:28 IST

అమెరికా: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ సోమవారం కరోనా టీకా తీసుకున్నారు. డెలవర్‌లోని క్రిస్టియానా ఆసుపత్రిలో 78 ఏళ్ల బైడెన్‌ ఫైజర్‌ టీకా మొదటి డోసు తీసుకున్నారు.  బైడెన్‌ వ్యాక్సినేషన్ ‌ఘట్టాన్ని అమెరికా ఛానళ్లు ప్రత్యక్షప్రసారం చేశాయి. టీకా తీసుకున్న సందర్భంగా బైడెన్‌ మాట్లాడుతూ.. ‘‘టీకా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రజల్లో అపోహను తొలగించేందుకే టీకా వేసుకుంటున్నాను. టీకా వేసుకోవడానికి ప్రజలు సన్నద్ధంగా ఉండాలి. నేను టీకా రెండో డోసు తీసుకోవడానికి ఎదురుచూస్తున్నాను’’ అని బైడెన్‌ తెలిపారు. టీకా తీసుకుంటున్న సందర్భంగా బైడెన్‌ సతీమణి జిల్‌ బైడెన్‌ ఆయన పక్కనే ఉన్నారు. ఆమె  అంతకు ముందురోజే టీకాను తీసుకున్నారు. వ్యాక్సిన్‌ల సమర్థతపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోందని, వ్యాక్సిన్‌ తీసుకోవడం సురక్షితమనే విషయాన్ని ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉందని బైడెన్‌ గతంలో పేర్కొన్నారు. బహిరంగంగానే టీకా తీసుకునేందుకు సిద్ధమని ఆయన గతంలోనే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో అపోహలను తొలగించడానికి బైడెన్‌ టీకా తీసుకుంటున్న కార్యక్రమాన్ని ఛానళ్లు ప్రసారం చేశాయి. 

ఫైజర్‌ వ్యాక్సిన్‌కు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఏ) అనుమతి లభించిన నేపథ్యంలో టీకా కార్యక్రమం మొదలైంది. గత వారం నుంచే అమెరికాలో పెద్దఎత్తున కరోనా టీకాను ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లు అయిన ఆరోగ్య సిబ్బందికి ఇస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటివరకు అమెరికాలో సుమారు మూడు లక్షల 20 వేల మంది చనిపోయారు. క్రిస్మస్‌ సెలవుల నేపథ్యంలో ప్రజలంతా ఒక్కచోట చేరే అవకాశం ఉండడంతో మాస్క్‌లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని జోబైడెన్‌ మరోసారి అమెరికన్లకు విజ్ఞప్తి చేశారు. 
 

ఇవీ చదవండి..

ట్రంప్‌ సార్‌.. ఇంకెప్పుడు?

ఇటలీలో మృత్యుఘోష: కారణాలు ఏంటంటే..!

 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని