Clinical Trials: డీసీజీఐ అనుమతి కోరిన J&J

సింగిల్‌ డోసు కరోనా వ్యాక్సిన్‌ మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహణకు అనుమతివ్వాలని భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ)ని ఫార్మా దిగ్గజం జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ అనుమతి కోరింది. దిగుమతి లైసెన్స్‌ జారీ చేయాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం....

Updated : 17 Oct 2022 11:29 IST

దిల్లీ: సింగిల్‌ డోసు కరోనా వ్యాక్సిన్‌ మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహణకు అనుమతివ్వాలని భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ)ని ఫార్మా దిగ్గజం జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ అనుమతి కోరింది. దిగుమతి లైసెన్స్‌ జారీ చేయాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. తమ దరఖాస్తుపై నిర్ణయం తీసుకోవడానికి త్వరితగతిన కేంద్ర ఔషధ ప్రామాణిక నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీఓ) నిపుణుల సమావేశం ఏర్పాటు చేయాలని జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కోరినట్లు తెలుస్తోంది. విదేశీ టీకాల అత్యవసర వినియోగానికి కావాల్సిన అనుమతులను మంజూరు చేసే ప్రక్రియను వేగవంతం చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే విదేశీ సంస్థల ఆ మేరకు దరఖాస్తు చేసుకుంటున్నాయి.

భారత్‌లో టీకాల కొరత ఏర్పడుతుండటంతో ఇతర దేశాలు అభివృద్ధి చేసిన టీకాలను భారత్‌కు ఎగుమతి చేసి, ఇక్కడే ఉత్పత్తి ప్రారంభించేందుకు ఆయా దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. రష్యా రూపొందించిన కరోనా టీకా స్పుత్నిక్‌-వి మరో పదిరోజుల్లో భారత్‌కు రానున్నట్లు రష్యాలో భారత రాయబారి బాల వెంకటేశ్‌ వర్మ వెల్లడించారు. ఈనెల చివరిలోపు రష్యా నుంచి స్పుత్నిక్‌ డోసుల మొదటి దిగుమతి జరగనుందని పేర్కొన్నారు. మే నెలలో భారత్‌లో ఉత్పత్తి ప్రారంభించి క్రమంగా ఆ సంఖ్యను పెంచనున్నట్లు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని