Earthquake: అఫ్గాన్‌లో భూకంపం.. కశ్మీర్‌, దిల్లీల్లో కంపించిన భూమి

అఫ్గానిస్థాన్‌లో శనివారం ఉదయం భూకంపం సంభవించింది. దీని ప్రభావం కారణంగా ఉత్తర భారతదేశంలో పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. జమ్మూకశ్మీర్‌తో

Updated : 05 Feb 2022 11:44 IST

దిల్లీ: అఫ్గానిస్థాన్‌లో శనివారం ఉదయం భూకంపం సంభవించింది. దీని ప్రభావం కారణంగా ఉత్తర భారతదేశంలో పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. జమ్మూకశ్మీర్‌తో పాటు నోయిడా, దిల్లీల్లో భూప్రకంనలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. 

శనివారం ఉదయం 9.45 గంటల ప్రాంతంలో అఫ్గాన్‌ - తజకిస్థాన్‌ సరిహద్దులో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 5.7గా నమోదైనట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సెస్మాలజీ వెల్లడించింది. అఫ్గానిస్థాన్‌లోని ఫైజాబాద్‌కు ఆగ్నేయ దిశలో 118 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే భూకంపం కారణంగా ఇప్పటివరకు ఆస్తి, ప్రాణ నష్టం సంభవించినట్లు సమాచారం లేదు.

దీని ప్రభావం కారణంగా జమ్మూకశ్మీర్‌లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఈ ఉదయం దాదాపు 30 సెకన్ల పాటు భూమి కంపించడంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నోయిడా, దిల్లీ పరిసర ప్రాంతాల్లోనూ భూమి కంపించినట్లు కొందరు స్థానికులు ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని