జర్నలిస్ట్‌ రోహిత్‌ సర్దానా మృతి.. మోదీ దిగ్భ్రాంతి!

ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ రోహిత్ సర్దానా కరోనాతో కన్నుమూశారు. తొలుత జీ న్యూస్‌లో పనిచేసిన ఆయన 2017లో ఆజ్ తక్‌లో చేరారు. సర్దానా 2018లో గణేష్ విద్యా పురస్కరాన్ని అందుకున్నారు......

Published : 30 Apr 2021 22:09 IST

దిల్లీ:  ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ రోహిత్ సర్దానా కరోనాతో కన్నుమూశారు. తొలుత జీ న్యూస్‌లో పనిచేసిన ఆయన 2017లో ఆజ్ తక్‌లో చేరారు. సర్దానా 2018లో గణేష్ విద్యా పురస్కారాన్ని అందుకున్నారు. భారతదేశంలో టీవీ జర్నలిజంలో అత్యంత ప్రజాదరణ పొందిన వ్య‌క్తుల్లో రోహిత్ స‌ర్దానా ఒక‌రు.

రోహిత్ సర్దానా మృతిపై ప్ర‌ధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోహిత్ మనల్ని త్వరగా విడిచి వెళ్లారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశ పురోగతి పట్ల మక్కువ కలిగిన వ్య‌క్తిగా స‌ర్దానాను అభివర్ణించారు. ఆయన అకాల మరణం మీడియా ప్రపంచంలో శూన్యతను మిగిల్చిందన్నారు. సర్దానా కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌ధాని త‌న ప్ర‌గాఢ‌ సంతాపాన్ని తెలియజేశారు.

హోంమంత్రి అమిత్ షా సైతం సర్దానా మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సర్దానా అకాల మరణం బాధ క‌లిగించింద‌న్నారు. ఓ ధైర్య‌వంతుడైన జ‌ర్న‌లిస్టును జాతి కోల్పోయింద‌న్నారు. నిష్పాక్షికమైన జ‌ర్న‌లిజానికి సర్దానా పెట్టింది పేర‌న్నారు. ఈ విషాదాన్ని త‌ట్టుకునే శ‌క్తిని దేవుడు తన కుటుంబానికి ఇవ్వాల్సిందిగా ప్రార్థించారు.

కేంద్ర హోంశాఖ స‌హాయమంత్రి కిష‌న్‌రెడ్డి, కేంద్ర మంత్రి కిర‌ణ్ రిజిజు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాలా సహా పలువురు రాజకీయ నాయకులు, బాలీవుడ్‌ ప్రముఖులు, మీడియా ప్రతినిధులు సర్దానా మృతి ప‌ట్ల విచారం వ్య‌క్తం చేశారు. కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి ప్రకటించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని