JP Nadda: రాజ్యసభా పక్ష నేతగా జేపీ నడ్డా?

భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాజ్యసభా పక్షనేతగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

Updated : 21 Jun 2024 19:08 IST

దిల్లీ: కేంద్రమంత్రి జేపీ నడ్డా(JP Nadda) రాజ్యసభా పక్షనేత(Leader Of House In Rajya Sabha)గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం నడ్డా భాజపా జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయన పదవీ కాలం ఈ నెలతో ముగుస్తుండడంతో.. ఏడాది చివర్లో జరగనున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యే వరకూ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలని అధిష్ఠానం కోరినట్లుగా సమాచారం.

అన్ని రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలు 50 శాతం పూర్తయిన తర్వాతే కొత్త జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకుంటారని పార్టీ నిబంధనలు చెబుతున్నాయి. డిసెంబర్-జనవరిలో ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది.

2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో భాజపా అధ్యక్షుడిగా ఉన్న అమిత్‌ షా.. కేంద్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పుడు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమితులైన నడ్డా.. జనవరి 2020లో పూర్తిస్థాయి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. తాజాగా ఆయన కేంద్ర మంత్రివర్గంలో చేరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని