- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
Bombay High Court: అత్యాచారాలపై వివాదాస్పద తీర్పుల జడ్జి పుష్ప రాజీనామా!
ముంబయి: చిన్నారులపై లైంగిక వేధింపుల కేసుల్లో వివాదాస్పద తీర్పులు ఇచ్చి.. కేంద్రబిందువుగా మారిన బాంబే హైకోర్టు మహిళా న్యాయముర్తి జస్టిస్ పుష్ప గనేడివాలా తన బాధ్యతలకు రాజీనామా చేశారు. అయితే పదవీ కాలం ముగిసే ఒక్క రోజు ముందే ఆమె రాజీనామా చేయటం గమనార్హం. అదనపు న్యాయమూర్తిగా ఆమె పదవీకాలం ఫిబ్రవరి 12తో పూర్తికానుంది.
జస్టిస్ గనేడివాలా ప్రస్తుతం బాంబే హైకోర్టులోని నాగ్‌పుర్ బెంచ్‌లో అదనపు న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్నారు. గతేడాది జనవరిలో రెండు లైంగిక వేధింపుల కేసుల్లో పుష్ప వివాదాస్పద తీర్పులు ఇచ్చారు. ఈ క్రమంలోనే పూర్తిస్థాయిలో న్యాయమూర్తి హోదా కల్పించాలనే ప్రతిపాదనను సుప్రీం కోర్టు కొలీజియం వెనక్కి తీసుకుంది. ఆమె అదనపు న్యాయమూర్తిగా పదవీ కాలాన్ని పొడగించటం, పూర్తిస్థాయి హోదా కల్పించటం వంటి వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఫలితంగా పుష్ప డిమోట్ అయ్యి.. 2022, ఫిబ్రవరి 12 నుంచి జిల్లా సెషన్స్ జడ్జిగా వెళ్లాల్సి ఉంటుంది. ఈ కారణంగానే ఆమె రాజీనామా చేసినట్లు హైకోర్టు వర్గాలు వెల్లడించాయి. న్యాయమూర్తి రాజీనామాకు ఆమోదం లభించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
2021 జనవరిలో జస్టిస్ పుష్ప రెండు సంచలన తీర్పులు వెలువరించారు. 12 ఏళ్ల బాలిక ఛాతీ భాగాన్ని ఓ వ్యక్తి తడమగా.. చర్మం తగలనందున దీనిని లైంగిక వేధింపుల కింద పరిగణించలేమని జనవరి 19న జస్టిస్ పుష్ప నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. దుస్తుల మీద నుంచి శరీరభాగాలను తాకడం వేధింపులుగా పేర్కొనలేమని.. లైంగిక ఉద్దేశంతో బాలిక దుస్తులు తొలగించి, లేదా దుస్తుల లోపలకి చేయి పెట్టి నేరుగా తాకితేనే అది లైంగిక వేధింపుల కిందకు వస్తుందని ధర్మాసనం పేర్కొంది.
అయిదేళ్ల బాలికపై లైంగిక వేధింపుల కేసులోనూ జస్టిస్ పుష్ప ఇలాంటి తీర్పునే ఇచ్చారు. మైనర్ బాలికల చేతులు పట్టుకోవడం, వారి ముందు పురుషుడు ప్యాంటు జిప్ విప్పుకోవడం లైంగిక వేధింపుల కిందికి రావని తీర్పు వెలువరించారు. వేధింపుల నుంచి బాలికలను రక్షించే పోక్సో చట్టం కింద వీటిని నేరంగా పరిగణించలేమని పేర్కొంటూ నిందితులకు కింది కోర్టు విధించిన శిక్షలను రద్దు చేశారు. కాగా ఈ తీర్పులు తీవ్ర దుమారం రేపాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Sanna Marin: మరో వివాదంలో ఫిన్లాండ్ ప్రధాని.. డ్యాన్స్ వీడియో వైరల్!
-
General News
అర్ధరాత్రి నుంచి నిలిచిపోనున్న ఎక్స్ఛేంజ్లో విద్యుత్ కొనుగోలు, అమ్మకాలు
-
India News
CBI searches: రూ.11కోట్ల నాణేలు అదృశ్యం.. 25చోట్ల సీబీఐ సోదాలు
-
Politics News
Subramanian Swamy: భాజపాలో ఎన్నికల్లేవ్.. అంతా ‘మోదీ’ ఆమోదంతోనే..!
-
General News
Andhra News: సీపీఎస్ కంటే జీపీఎస్ మరింత ప్రమాదకరం: ఉద్యోగ సంఘాలు
-
Movies News
Chiranjeevi: మెగా హీరోలను కలవాలనుకుంటున్నారా? మీకిదే అవకాశం!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Vinod kambli: బీసీసీఐ పింఛనే నాకు దిక్కు.. సచిన్ నుంచి ఏమీ ఆశించట్లేదు: వినోద్ కాంబ్లి
- Madhavan: ‘రాకెట్రీ.. మాధవన్ ఇంటిని కోల్పోయాడు’
- Andhra News: వివాహితను భయపెట్టి నగ్న వీడియో కాల్..
- Liger: ‘లైగర్’ సినిమా.. ఏడు అభ్యంతరాలు చెప్పిన సెన్సార్ బోర్డ్
- DK : ఆయన ఓటమిని అస్సలు తట్టుకోలేడు.. సహనం తక్కువే.. కానీ!
- Thiru review: రివ్యూ: తిరు
- Liger: లైగర్ ఓటీటీ ఆఫర్ ఎందుకు వదులుకున్నారు?
- Jammu: ఉగ్రవాది అతితెలివి.. ఎన్కౌంటర్ చేసిన పోలీసులు
- అజిత్ డోభాల్ ఇంటి వద్ద వ్యక్తి హల్చల్ ఘటన.. ముగ్గురు కమాండోలపై వేటు
- Vizag: విశాఖలో రౌడీషీటర్ హత్య.. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఘాతుకం