Donald Trump: నేను దేశాధ్యక్షుడిగా ఉంటే ఈ పేలుళ్లు జరిగేవి కావు

కాబుల్‌ విమానాశ్రయం వద్ద పేలుళ్లు.. అమెరికా సైన్యం మృతిపట్ల అగ్రరాజ్యం మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. అమెరికా అధ్యక్షుడిగా తానుంటే ఈ బాంబు పేలుళ్లు జరిగి ఉండేవి కాదని పేర్కొన్నారు.....

Published : 27 Aug 2021 23:04 IST

వాషింగ్టన్‌: కాబుల్‌ విమానాశ్రయం వద్ద పేలుళ్లలో అమెరికా సైన్యం మృతిపట్ల అగ్రరాజ్యం మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడిగా తానుంటే ఈ బాంబు పేలుళ్లు జరిగి ఉండేవి కాదని పేర్కొన్నారు. దేశ ప్రజలను ఉద్దేశించి ట్రంప్‌ మాట్లాడుతూ.. ‘ఈ దేశాధ్యక్షుడిగా నేనుంటే ఇలాంటి విషాదం జరిగుండేది కాదు. అఫ్గానిస్థాన్‌లో క్రూరమైన, అనాగరిక తీవ్రవాద దాడిలో ధైర్యవంతులైన అమెరికా సైనికుల మృతిపట్ల దేశం మొత్తం విషాదం వ్యక్తం చేస్తోంది. వీర సైనికుల మృతదేహాలు మురుగు కాలువలో కొట్టుకుపోవడం చూసి దేశం దుఃఖిస్తోంది. తమ దేశ ప్రజలను కాపాడేందుకు, విధి నిర్వహణలో అమెరికన్ యోధులు తమ జీవితాలను పణంగా పెట్టారు’ అని ట్రంప్‌ ఆవేదన చెందారు. సైనికుల త్యాగాలను తమ దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని పేర్కొన్నారు.

కాబుల్ విమానాశ్రయంలో గురువారం సాయంత్రం జరిగిన ఉగ్రదాడిలో 103 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 13 మంది అమెరికా సైనికులు కూడా ఉన్నారు. వారికి నివాళి అర్పిస్తూ శ్వేతసౌధం నుంచి బైడెన్‌ జాతినుద్దేశించి ప్రసంగించారు. మృతి చెందిన అమెరికా సైనికులను హీరోలుగా అభివర్ణించారు. ఈ ఘాతుకానికి కారకులైన వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. దేశంలో ప్రశాంతత, అంతర్జాతీయంగా అమెరికాకు మరింత గౌరవం తీసుకువస్తామని వాగ్దానం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని