Kangana Ranaut: సోదరుడి వివాహానికి ఖరీదైన గిఫ్ట్‌ ఇచ్చిన కంగన..ఏంటంటే?

బాలీవుడ్‌ నటి, మండి ఎంపీ కంగనా రనౌత్‌ తన కజిన్‌ సోదరుడికి వివాహ బహుమతిగా ఓ ఖరీదైన ఇంటిని ఇచ్చారు.

Published : 17 Jun 2024 19:20 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: తన కజిన్ సోదరుడు వరుణ్ రనౌత్‌(Varun Ranaut) వివాహానికి హాజరైన బాలీవుడ్‌ నటి, మండి ఎంపీ కంగనా రనౌత్(Kangana Ranaut) అతడికి ఓ ఖరీదైన ఇంటిని బహుమతిగా ఇచ్చారు. దీనికి సంబంధించి వరుణ్ రనౌత్‌ కృతజ్ఞతలు తెలుపుతూ చేసిన పోస్టులను కంగనా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది. అనంతరం ఆమె సోదరి చేసిన పోస్ట్‌ను సైతం షేర్‌ చేసింది. అందులో ‘‘ప్రియమైన సోదరి కంగనా రనౌత్‌…నువ్వు ఎల్లప్పుడూ మా కలలను నిజం చేస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు” అంటూ తన సోదరి చేసిన పోస్ట్‌కు కంగన స్పందిస్తూ మన దగ్గర ఉన్నది కొంచమైనా మనవారితో పంచుకోవాలి. నాకు మీతో పంచుకోవడంలోనే ఆనందం ఉంది అని తెలిపారు.

ప్రస్తుతం కంగన ఎమర్జెన్సీ చిత్రంలో భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రను పోషిస్తున్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కంగన భాజపా తరపున పోటీ చేశారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు.

 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని