Kangana Ranaut : ఇన్‌స్టా ఫొటోలు షేర్ చేసుకోవడానికే..: కంగన వ్యాఖ్యలు

ఇంతకుముందు ట్విటర్ బ్లూటిక్‌ గురించి స్పందించిన కంగనా రనౌత్.. తాజాగా ఇన్‌స్టాగ్రాం గురించి వ్యాఖ్యలు చేశారు.

Published : 12 Nov 2022 02:04 IST

ముంబయి: బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ ఏ అభిప్రాయన్నైనా నిస్సంకోచంగా చెప్పేస్తుంటారు. తాజాగా ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రాంపై వ్యాఖ్యలు చేశారు. ఈ వేదిక ఫొటోలు షేర్ చేసుకోవడానికి మాత్రమే పనికొస్తుందని, ఒక అంశంపై అభిప్రాయాన్ని వెల్లడించడానికి ఉపయోగపడదని కాస్త ఘాటుగా స్పందించింది. 

‘ఈ ఇన్‌స్టాగ్రాం చిత్రాలకు సంబంధించింది. ఎవరైనా ఏదైనా అభిప్రాయం రాసినా అది మరుసటి రోజుకు అదృశ్యమవుతుంది. కొందరు ఉంటారు.. వారు చెప్పేదానికి ఎలాంటి అర్థం ఉండదు. వారి సందేశం అదృశ్యమైనా వారేం పట్టించుకోరు. కానీ ఇంకొందరు వారి ఆలోచనలను వెల్లడించాలనుకుంటారు. అందుకోసం ఇవి మినీ బ్లాగ్స్‌లా ఉండాలి’ అని ఆమె వ్యాఖ్యానించారు. 

ఇంతకుముందు ట్విటర్ బ్లూ టిక్‌ పై కూడా కంగనా స్పందించారు. ట్విటర్‌ వెరిఫైడ్‌ యూజర్లకు సబ్‌స్క్రిప్షన్‌ కింద నెలకు 8 అమెరికన్‌ డాలర్లు వసూలు చేయాలంటూ ఆ సంస్థ నూతన యజమాని ఎలాన్‌మస్క్‌ తీసుకున్న నిర్ణయాన్నిఆమె స్వాగతించారు. ట్విటర్‌ను కొత్త పుంతలు తొక్కించేలా మస్క్‌ నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. ఆధార్‌కార్డు ఉన్నవారంతా బ్లూ టిక్‌ను తప్పకుండా పొందాలని ఆమె అన్నారు.

ట్విటర్‌ నిబంధనలను పదేపదే అతిక్రమిస్తున్నారంటూ మే 2021లో కంగన అకౌంట్‌ను ట్విటర్‌ శాశ్వతంగా మూసివేసిన సంగతి తెలిసిందే. ప్రత్యేకించి విద్వేషపూరిత ప్రవర్తన, దుర్భాషలాడే స్వభావం నిబంధన కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్విటర్‌ అప్పట్లో వెల్లడించింది. మస్క్‌ ట్విటర్‌ను చేజిక్కించుకున్న తర్వాత కంగన్‌ అకౌంట్‌ను పునరుద్ధరిస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆమె మస్క్‌ నిర్ణయానికి అనుకూలంగా పోస్టు చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని