Divya Spandana: అప్పుడు రాహులే నాకు మానసిక ధైర్యం ఇచ్చారు: నటి వ్యాఖ్యలు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) క్లిష్టసమయంలో తనకు ఎంతో అండగా ఉన్నారని ఆ పార్టీ నేత దివ్యస్పందన వెల్లడించారు. ఓ టాక్‌షోలో మాట్లాడుతూ గతానుభవాలను తెలిపారు. 

Published : 31 Mar 2023 01:27 IST

బెంగళూరు: తన తండ్రి దూరమైన తర్వాత ఆత్మహత్య ఆలోచనలతో సతమతమైనట్లు నటి, కాంగ్రెస్ (Congress) మాజీ ఎంపీ దివ్య స్పందన (Divya Spandana) వెల్లడించారు. ఆ సమయంలో అగ్రనేత రాహుల్ గాంధీ((Rahul Gandhi) తనకు మానసిక ధైర్యాన్ని ఇచ్చారని చెప్పారు. ఇటీవల ఓ కన్నడ టాక్‌షోలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 

‘నా తండ్రి చనిపోయిన రెండువారాలకే నేను పార్లమెంట్‌(Parliament)కు వెళ్లాను. అక్కడ నాకు ఎవరూ తెలీదు. ఏమీ తెలీదు. పార్లమెంట్ కార్యకలాపాల గురించి అస్సలు ఐడియాలేదు. చిన్నచిన్నగా అన్ని విషయాలు తెలుసుకోవడం ప్రారంభించాను. పనిలో పడి నా బాధను తగ్గించుకునే ప్రయత్నం చేశాను. మాండ్య(Mandya) ప్రజలు నాపై నమ్మకాన్ని ఉంచారు.’ అని అన్నారు. ‘నా తండ్రి దూరమైన సమయంలో నాకు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వచ్చాయి. అప్పుడు రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) నాకు మానసికంగా అండగా నిలిచారు. అమ్మ ప్రభావం నాపై ఎంతగానో ఉంటుంది. తర్వాత నా తండ్రి, మూడోస్థానంలో రాహుల్‌ గాంధీ ఉంటారు’ అని తెలిపారు. 

దివ్యస్పందన (Divya Spandana) 2012లో యూత్ కాంగ్రెస్‌లో చేరారు. 2013లో జరిగిన ఉపఎన్నికలో మాండ్య (Mandya) నుంచి విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీకి సోషల్‌ మీడియా హెడ్‌గాను బాధ్యతలు నిర్వర్తించారు. మళ్లీ సినిమా పరిశ్రమలోకి అడుగుపెడుతున్నట్లు గత ఏడాది ప్రకటించిన ఆమె..సొంతంగా ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు