Kapil Sibal: రిజిజు నిజంగా రత్నమే.. కపిల్‌ సిబల్ వ్యంగ్యాస్త్రాలు

కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు(Kiren Rijiju) .. న్యాయవ్యస్థను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభ ఎంపీ కపిల్‌ సిబల్ స్పందించారు. ట్విటర్ వేదికగా విమర్శలు చేశారు.

Published : 24 Jan 2023 16:14 IST

దిల్లీ: అధికారాలు, పరిధులకు సంబంధించి న్యాయ వ్యవస్థ(Judiciary), ప్రభుత్వం మధ్య తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఈ విషయంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు(Kiren Rijiju) తీవ్రస్థాయిలోనే స్పందిస్తుంటారు. ఈ తీరుపై రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్(Kapil Sibal) విమర్శలు చేశారు. రిజిజు మరో జెమ్‌ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

‘‘రిజిజు రూపంలో మరో రత్నం దొరికింది. ‘న్యాయవ్యవస్థను దెబ్బతీసేలా మోదీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు’ అని చెప్తున్నారు. అయితే మరి.. మీరు చేసే వివాదాస్పద వ్యాఖ్యలు న్యాయవ్యవస్థను బలోపేతం చేస్తున్నాయా..? వాటిని మీరు నమ్మొచ్చు. న్యాయవాదులమైన మేం కాదు’’ అని కపిల్ సిబల్(Kapil Sibal) వ్యాఖ్యానించారు. 

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిన్న దిల్లీలోని తీస్‌ హజారికోర్టుల సముదాయంలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి రిజిజు(Kiren Rijiju) మాట్లాడారు. ‘జడ్జీలకు ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అగత్యం లేదు. పనితీరుపై తనిఖీలూ ఉండవు. ప్రజలు ఎన్నుకోరు కాబట్టి న్యాయమూర్తులను తొలగించలేరు’ అని పేర్కొన్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని