Covid: కర్ణాటకలో40కిపైగా విద్యార్థులకు పాజిటివ్‌

కర్ణాటక ప్రభుత్వం విద్యార్థులకు ర్యాండమ్‌గా నిర్వహిస్తున్న కొవిడ్‌ పరీక్షల్లో పెద్దఎత్తున కేసులు బయటపడుతున్నాయి. తాజాగా చిక్కమగళూరు జిల్లాలోని జవహర్‌ నవోదయ విద్యాలయంలో 40కిపైగా విద్యార్థులకు మహమ్మారి సోకినట్లు తేలింది. దీంతోపాటు శివమొగ్గలోని...

Updated : 05 Dec 2021 20:22 IST

బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం విద్యార్థులకు ర్యాండమ్‌గా నిర్వహిస్తున్న కొవిడ్‌ పరీక్షల్లో పెద్దఎత్తున కేసులు బయటపడుతున్నాయి. తాజాగా చిక్‌మగళూరు జిల్లాలోని జవహర్‌ నవోదయ విద్యాలయంలో 40కిపైగా విద్యార్థులకు మహమ్మారి సోకినట్లు తేలింది. దీంతోపాటు శివమొగ్గలోని ఓ ప్రైవేటు నర్సింగ్‌ కళాశాలలో 29 మంది విద్యార్థులకు కొవిడ్‌ పాజిటివ్‌గా వెల్లడైంది. వారిలో చాలా మందికి లక్షణాలు లేవని స్థానిక డిప్యూటీ కమిషనర్‌ కేబీ శివకుమార్‌ తెలిపారు. దీంతో ఈ ప్రాంతాలను క్లస్టర్‌లుగా ప్రకటించి, హాస్టళ్లను మూసివేసినట్లు అధికారులు చెప్పారు. పరిసరాల్లో ఎవరికైనా వ్యాప్తి చెందిందా నిర్ధారించేందుకుగానూ.. స్థానికుల నమూనాలనూ పరీక్షిస్తున్నట్లు చెప్పారు.

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కట్టడికి.. ఒకే చోట మూడు, అంతకంటే ఎక్కువ కేసులు వెలుగుచూసిన ప్రాంతాన్ని క్లస్టర్‌గా పరిగణిస్తామని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రకటించిన విషయం తెలిసిందే. ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో ఏడు వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో మొదటి రెండు ఒమిక్రాన్‌ కేసులు కర్ణాటకలోనే బయటపడిన నేపథ్యంలో.. అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని