కర్ణాటక సీఎంకు రెండోసారి కరోనా

కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్పకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన చికిత్స నిమిత్తం స్థానిక మణిపాల్‌ ఆసుపత్రిలో చేరారు. ఈ విషయాన్ని సీఎం

Updated : 16 Apr 2021 15:57 IST

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్పకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన చికిత్స నిమిత్తం స్థానిక మణిపాల్‌ ఆసుపత్రిలో చేరారు. ఈ విషయాన్ని సీఎం ట్విటర్‌  ద్వారా వెల్లడించారు.

‘‘కాస్త జ్వరం రావడంతో నేడు కొవిడ్‌ పరీక్షలు చేయించుకున్నాను. అందులో నాకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. నేను ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ.. వైద్యుల సూచన మేరకు ఆసుపత్రిలో చేరాను. ఇటీవల నన్ను కలిసిన వారందరూ జాగ్రత్తగా ఉండండి’’ - ట్విటర్‌లో యడియూరప్ప

కాగా.. యడియూరప్పకు కరోనా సోకడం ఎనిమిది నెలల్లో ఇది రెండోసారి. గతేడాది ఆగస్టు 2న ఆయనకు కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. దాంతో మణిపాల్‌ ఆసుపత్రిలో తొమ్మది రోజుల పాటు చికిత్స తీసుకుని కోలుకున్నారు. ఇటీవలే ఆయన వ్యాక్సిన్‌ తొలి డోసు తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. ఆసుపత్రిలో చేరడానికి కొద్ది గంటల ముందే సీఎం తన నివాసంలో రాష్ట్ర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత మీడియా సమావేశం కూడా నిర్వహించారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని