Karnataka: పార్టీ కార్యకర్తపై చేయిచేసుకున్న సిద్ధ రామయ్య

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య పార్టీ కార్యకర్తలపై చేయి చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

Published : 24 Mar 2023 18:35 IST

బెంగళూరు: కాంగ్రెస్‌ నేత, కర్ణాటక మాజీ సీఎం సిద్ధ రామయ్య సొంత పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్నారు. శుక్రవారం ఉదయం ఆయన నివాసం వద్ద ఈ ఘటన జరిగింది. త్వరలో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హరిహర్‌ ఎమ్మెల్యే రామప్పకు టికెట్‌ ఇవ్వాలని ఆయన మద్దతుదారులు డిమాండ్‌చేశారు. ఈ క్రమంలో సిద్ధ రామయ్య  ఇంటి ముందు గుంపుగా చేరారు. అదే సమయంలో బయటకు వచ్చిన సిద్ధ రామయ్యను చుట్టుముట్టారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. దీంతో కోపగించుకున్న ఆయన.. పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్నారు. వెంటనే అక్కడ్నుంచి కారులో వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు