Published : 14 Apr 2022 15:47 IST

Karnataka hijab case: హిజాబ్‌ను అనుమతించాలని మరోసారి అభ్యర్థన..!

బెంగళూర్‌: కర్ణాటకలో ఈ నెల 22 నుంచి పీయూ రెండో సంవత్సర పరీక్షలు ప్రారంభం కానున్న సమయంలో మరోసారి హిజాబ్‌ వివాదం తెరపైకి వచ్చింది. విద్యార్థులను హిజాబ్ ధరించి పరీక్షలు రాసేందుకు అనుమతించాలని ఈ కేసు పిటిషనర్లలో ఒకరైన న్యాయవాది అలియా అస్సాదీ  రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైని అభ్యర్థించారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రిని ట్యాగ్‌ చేస్తూ ఓ ట్వీట్‌ చేశారు. ‘విద్యార్థుల భవిష్యత్తు నాశనం కాకుండా చూసేందుకు మీకు ఇంకా అవకాశం ఉంది. హిజాబ్ ధరించి పరీక్షలు రాయడానికి వారిని అనుమతించండి. దయచేసి ఈ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోండి’ అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఈ ఏడాది జనవరిలో హిజాబ్‌ వివాదం మొదలైంది. ఉడుపిలోని ఒక ప్రభుత్వ పీయూ కళాశాలలో నిర్ణీత డ్రెస్‌ కోడ్‌ను ఉల్లంఘించేలా హిజాబ్‌ ధరించి తరగతులకు హాజరైన ఆరుగురు విద్యార్థినులపై చర్యలు తీసుకోవడం వివాదాస్పదమైంది. ఆ తర్వాత సమీపంలోని కుందాపూర్, బైందూరులోని మరికొన్ని కళాశాలలకు ఈ వివాదం వ్యాపించింది. ఈ నేపథ్యంలో కళాశాలల్లో హిజాబ్‌ను అనుమతించాలని కోరుతూ విద్యార్థినులు దాఖలు చేసిన అన్ని పిటిషన్లను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. విద్యాసంస్థల్లో అందరూ ఏకరీతి దుస్తుల నియమాన్ని పాటించాలని  తీర్పునిచ్చింది. కోర్టు తీర్పును పాటించకపోతే పరీక్ష రాయడానికి అనుమతించబోమని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts