Darshan Case: కస్టడీలో దర్శన్‌కు పోలీసుల ‘రాచమర్యాదలు’?

పోలీస్‌ కస్టడీలో ఉన్న దర్శన్‌కు ప్రత్యేక సదుపాయాలు కల్పించడం లేదని కర్ణాటక హోంశాఖ స్పష్టం చేసింది.

Updated : 14 Jun 2024 14:17 IST

బెంగళూరు: అభిమాని హత్య కేసులో అరెస్టైన కన్నడ నటుడు దర్శన్‌కు కస్టడీలో రాచమర్యాదలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. వీటిని కర్ణాటక ప్రభుత్వం ఖండించింది. కస్టడీలో ఉన్న దర్శన్‌కు ప్రత్యేక సదుపాయాలు కల్పించడం లేదని స్పష్టం చేసింది.

‘‘దర్శన్‌కు బిర్యానీలు, రాయల్‌ ట్రీట్మెంట్‌ ఇవ్వడం లేదు. మీడియాలో వచ్చిన కథనాల నేపథ్యంలో నేను పోలీసు ఉన్నతాధికారులను ఆరా తీశాను. దర్శన్‌కు ఎటువంటి రాచమర్యాదలు చేయడం లేదని వారు చెప్పారు. అతడిపై ఎటువంటి సానుభూతి లేదు. మిగిలిన నిందితుల మాదిరిగానే అతడితో వ్యవహరిస్తున్నాం. పోలీసులకు స్వేచ్ఛను ఇవ్వాలి. అదే సమయంలో ఎటువంటి ప్రభావాలకు/ఒత్తిళ్లకు గురికాకుండా విచారణ జరపాలని వారికి సూచించా’’ అని కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర పేర్కొన్నారు. ఇక అన్నపూర్ణేశ్వరి నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద పోలీసుల కఠిన ఆంక్షలపై వస్తోన్న ఫిర్యాదులపై స్పందిస్తూ.. ఈ విషయంలో అధికారులకు తగు సూచనలు చేస్తానన్నారు.

ఆ డ్రైవర్‌ అరెస్టు..

రేణుకాస్వామి హత్యకు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. స్వామిని అతడి ఇంటి నుంచి తీసుకెళ్లిన రవి అనే డ్రైవర్‌.. చిత్రదుర్గ పోలీసుల ముందు లొంగిపోయాడు. ఘటన జరిగిన రోజు బాధితుడితో పాటు మరో ఎనిమిది మందిని తన వాహనంలో చిత్రదుర్గలో ఎక్కించుకున్న ఆ డ్రైవర్‌.. వారందర్నీ బెంగళూరులో విడిచిపెట్టాడు. ఆ తర్వాత హత్య వెలుగు చూడటంతో తాజాగా పోలీసుల ముందు సరెండర్‌ అయ్యాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని