Umesh Katti: ‘మాస్క్ పెట్టుకోను.. నా ఇష్టం’.. అంటోన్న మంత్రిగారు..!
దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోన్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తి కట్టడికి మాస్క్ (Mask)లు, భౌతికదూరం వంటి నిబంధనలు తప్పనిసరి అని అటు నిపుణులు,
బెళగావి: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోన్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తి కట్టడికి మాస్క్ (Mask)లు, భౌతికదూరం వంటి నిబంధనలు తప్పనిసరి అని అటు నిపుణులు, ఇటు ప్రభుత్వాలు పదే పదే హెచ్చరిస్తూనే ఉన్నాయి. అయినా కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూనే ఉన్నారు. కానీ, సామాన్య ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అమాత్యులే నిబంధనలను గాలికొదిలేస్తే..! కర్ణాటక (Karnataka)లో ఓ మంత్రి గారి తీరు ఇలాగే ఉంది. ‘మాస్క్ పెట్టుకోండి’ అని ప్రజలకు చెప్పాల్సింది పోయి.. తానే మాస్క్ ధరించేది లేదని తెగేసి చెబుతున్నారు.
కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఉమేశ్ కట్టి (Umesh Katti) మంగళవారం బెళగావిలోని ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ సందర్భంగా ఆయన మాస్క్ పెట్టుకోకుండా కన్పించారు. అదేమని ప్రశ్నిస్తే సదరు మంత్రి తన వైఖరిని సమర్థించుకోవడం గమనార్హం. మాస్క్ తనకు ఇష్టం లేదని, అందుకే పెట్టుకోనని చెప్పడంతో అంతా విస్తుపోయారు. ‘‘మాస్క్ ధరించడంపై ఎలాంటి ఆంక్షలు లేవు.. అది ప్రతి ఒక్కరి బాధ్యత మాత్రమే అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. మాస్క్ పెట్టుకోవాలా వద్దా అన్నది ప్రజల ఇష్టం. దాన్ని ధరించడం నాకు ఇష్టం లేదు కాబట్టి.. నేను మాస్క్ పెట్టుకోలేదు. ఇది నా వ్యక్తిగత నిర్ణయం’’ అని మంత్రి వివరించారు.
కర్ణాటకలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో మంత్రి తీరు ప్రతి ఒక్కరినీ నివ్వెరపరుస్తోంది. ఇటీవల కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ కూడా కరోనా పరీక్షలు చేయించుకునేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఓ ప్రభుత్వాధికారి.. శివకుమార్‌ను కలిశారు. ఆ మరుసటి రోజే సదరు అధికారికి పాజిటివ్‌గా తేలింది. దీంతో డీకేను పరీక్షలు చేయించుకోవాలని అధికారులు అడగ్గా.. అందుకు ఆయన నిరాకరించారు. ప్రభుత్వం కావాలనే కొవిడ్ సోకిన అధికారిని తన వద్దకు పంపించిందని దుయ్యబట్టడం గమనార్హం.
ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా రోజువారీ కొవిడ్ కేసులు అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి. నిన్న రాష్ట్రవ్యాప్తంగా 41,457 కొత్త కేసులు వెలుగుచూశాయి. పాజిటివిటీ రేటు 22శాతం దాటింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Liquor Policy Case: రూ.100కోట్ల చెల్లింపులపై ఈడీ ప్రకటన.. అక్రమంగా ఒక్క రూపాయీ లేదన్న ఆప్
Liquor Policy Case: దిల్లీ మద్యం కుంభకోణంలో భారాస ఎమ్మెల్సీ కవిత తమ నేతలకు రూ.100 కోట్లు చెల్లించడంలో భాగస్వామి అయ్యారని ఈడీ చేసిన ప్రకటనపై ఆమ్ ఆద్మీ పార్టీ మండిపడింది. ఇదంతా కుట్రలో భాగమేనని ఆరోపించింది. -
Modi: ‘మీవాళ్లు క్షేమంగా ఉన్నారు..త్వరలో తిరిగొస్తారు’: బల్గేరియా అధ్యక్షుడికి మోదీ రిప్లై
తమ దేశీయుల్ని రక్షించడంలో భారత నౌకాదళం ప్రదర్శించిన ధైర్యసాహసాలకు బల్గేరియా నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. వీటికి ప్రధాని మోదీ(Modi) స్పందించారు. -
Gadchiroli: గడ్చిరోలిలో ఎదురుకాల్పులు.. నలుగురు మావోయిస్టుల హతం
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. -
సర్కార్ సొమ్ము కోసం అన్నాచెల్లెళ్ల పెళ్లి
ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన సీఎం సామూహిక వివాహ పథకం ద్వారా వచ్చే ప్రయోజనాలను పొందేందుకు అన్నాచెల్లెళ్లు పెళ్లి చేసుకున్నారు. మహారాజ్‌గంజ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. -
దుస్తుల్లేని చిన్ననాటి ఫొటోపై అభ్యంతరం.. అకౌంట్‌ను నిలిపివేసిన గూగుల్
చిన్నప్పటి ఫొటోను డ్రైవ్‌లోకి అప్లోడ్ చేసిన వ్యక్తికి గూగుల్ షాకిచ్చింది. అతడి అకౌంట్‌ను నిలిపివేసింది. దీనిపై ఏడాదిగా గూగుల్‌తో పోరాడుతున్నా ఫలితం లేకపోవడంతో బాధితుడు గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. -
ఎన్నికల బాండ్ల సమాచారమంతా వెల్లడించాల్సిందే
ఎన్నికల బాండ్ల అంశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) అనుసరిస్తున్న వైఖరిపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంపిక చేసుకున్న సమాచారాన్ని మాత్రమే ఇవ్వాలన్న ధోరణిని బ్యాంక్ విడనాడాలని, మొత్తం వివరాలు ఈ నెల 21లోపు బహిర్గతం చేయాలని ఆదేశించింది. -
పశ్చిమ బెంగాల్ డీజీపీపై వేటు
సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. పశ్చిమ బెంగాల్ డీజీపీతోపాటు 6 రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులను తప్పించింది. వారితోపాటు రెండు రాష్ట్రాల్లో సాధారణ పరిపాలనశాఖ కార్యదర్శులను బదిలీ చేసింది. -
ఆజం ఖాన్‌కు ఏడేళ్ల జైలుశిక్ష
ఉత్తర్‌ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజం ఖాన్‌కు స్థానిక కోర్డు ఏడేళ్ల జైలుశిక్షను విధించింది. 2016లో దుంగార్పుర్లో ఒక ఇంటిని బలవంతంగా కూల్చివేసిన కేసులో ఈ శిక్షను ఖరారు చేసింది. -
‘సామాజిక’ ప్రచారం
ప్రపంచంలోనే అతి పెద్ద ఎన్నికల ప్రక్రియకు దేశం సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఓటర్లను ఆకర్షించేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నాలను ప్రారంభించాయి. ఇందులో భాగంగా వాట్సప్, సామాజిక మాధ్యమాలు, ఇన్ఫ్లుయెన్సర్లకు గిరాకీ పెరిగింది. -
వేడెక్కుతున్న ఉత్తర భారతం
ఉత్తర భారతంలో 1970 నుంచి శీతాకాలం క్రమంగా ఎండా కాలంగా మారిపోతోందని అమెరికన్ శాస్త్రజ్ఞుల బృందం క్లైమేట్ సెంట్రల్ హెచ్చరించింది. ఈ బృందం 1970 నుంచి డిసెంబరు-ఫిబ్రవరి కాలంలో ఉత్తర భారత్‌లో ఉష్ణోగ్రతల తీరుతెన్నులను విశ్లేషించింది. -
స్నేహమంటే అదే కదా.. నేవీ ఆపరేషన్‌పై జై శంకర్ స్పందన
సోమాలియా సముద్రపు దొంగల చేతిలో హైజాక్‌కు గురైన ఓ వాణిజ్య ఓడను భారత నౌకాదళం కాపాడిన విషయం తెలిసిందే. దాంతో మన రక్షణ సిబ్బంది చేసిన ఆపరేషన్‌పై బల్గేరియా నుంచి కృతజ్ఞతలు వ్యక్తమయ్యాయి. -
మమ్మల్ని దర్యాప్తు సంస్థలా మార్చకండి
గుజరాత్ యూనివర్సిటీలో గత వారాంతంలో విదేశీ విద్యార్థులపై చోటు చేసుకున్న దాడిని సుమోటోగా స్వీకరించాలంటూ ఓ న్యాయవాది దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) ఆ రాష్ట్ర హైకోర్టు సోమవారం తిరస్కరించింది. -
పోలీసు కాల్పుల్లో ఉపాధ్యాయుడి మృతి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో చిన్నపాటి ఘర్షణ కారణంగా హెడ్ కానిస్టేబుల్ కాల్పులు జరపడంతో ఓ ఉపాధ్యాయుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన సివిల్ లైన్స్ ప్రాంతంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. -
హిమాచల్‌ప్రదేశ్ కాంగ్రెస్ రెబల్స్‌కు సుప్రీంకోర్టులో దక్కని ఊరట
కాంగ్రెస్ పార్టీ విప్‌ను ధిక్కరించి ఎమ్మెల్యే పదవికి అనర్హులైన ఆరుగురు రెబల్స్‌కు సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట లభించలేదు. -
వివక్షతో ఉద్యోగాలు నిరాకరించొద్దు
ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ట్రాన్స్జెండర్లపై వివక్ష ఉండకూడదని, వారికి సమాన అవకాశాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. -
వ్యక్తిగత హోదాలోనే విరాళాలిచ్చాను
ప్రముఖ ఔషధ తయారీ సంస్థ బయోకాన్ లిమిటెడ్.. ఏ పార్టీకీ ఎన్నికల బాండ్ల ద్వారా విరాళాలివ్వలేదని ఆ సంస్థ ఛైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా సోమవారం వెల్లడించారు. -
ఈడీ సమన్లను లెక్కచేయని కేజ్రీవాల్
నగదు అక్రమ చలామణి కేసులో ప్రశ్నలకు జవాబివ్వడానికి సోమవారం రావాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీచేసిన సమన్లను దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లెక్కచేయలేదు. -
సాంక్రమికేతర వ్యాధులను పెంచుతున్న ఆహారపుటలవాట్లు
భారతీయుల ఆహారంలో మితిమీరిన ఉప్పు వినియోగం, సరిపడా పొటాషియం లేకపోవడం వంటి ఆందోళనకర పోకడలు పెరుగుతున్నాయని తాజా పరిశోధన తేల్చింది. -
భారత నౌకాదళం భేష్: అమెరికా రక్షణ మంత్రి ప్రశంస
హిందూ మహాసాగరంలో సముద్రపు దొంగల ఆటకట్టించే ఆపరేషన్ల నిర్వహణలో భారత నౌకాదళ పాత్రను అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ కొనియాడారు. శుక్రవారం భారత నౌకాదళం నడి సముద్రంలో సాహసోపేత ఆపరేషన్ నిర్వహించి.. -
సంక్షిప్త వార్తలు (5)
కబేళాలు, మాంసం ప్రాసెసింగ్ యూనిట్లను ‘పర్యావరణ ప్రభావ మదింపు(ఈఐఏ)-2006’ పరిధిలోకి చేర్చాల్సిన అవసరం లేదని జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ)కు కేంద్ర ప్రభుత్వం సూచించింది. -
Indian Navy: కొచ్చిలో కుప్పకూలిన నిఘా ఎయిర్‌క్రాఫ్ట్
భారత నేవీకి చెందిన రిమోట్లీ పైలెటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్ (RPA) కొచ్చిలోని ఐఎన్ఎస్ గరుడ బేస్ వద్ద కూలిపోయింది.
తాజా వార్తలు (Latest News)
-
SS Rajamouli: త్వరలో షూటింగ్.. మహేశ్ మూవీపై జక్కన్న అప్డేట్
-
MLC Kavitha: సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న కవిత
-
IPL 2024: రోహిత్ శర్మ, సంజు శాంసన్ మధ్య కెప్టెన్సీలో పోలికలు ఇవే: ధ్రువ్ జురెల్
-
TS News: తమిళిసై రాజీనామాకు ఆమోదం.. ఝార్ఖండ్ గవర్నర్‌కు అదనపు బాధ్యతలు
-
Liquor Policy Case: రూ.100కోట్ల చెల్లింపులపై ఈడీ ప్రకటన.. అక్రమంగా ఒక్క రూపాయీ లేదన్న ఆప్
-
POLL: రోహిత్‌ను కాదని హార్దిక్‌కు కెప్టెన్సీ... ముంబయి ఇండియన్స్ నిర్ణయం సరైనదేనా?