Published : 19 Jan 2022 22:26 IST

Corona: కర్ణాటకలో ఒక్కరోజే 40,499 కేసులు.. కేరళలో 134 మరణాలు

ఇంటర్నెట్ డెస్క్‌: దేశంలో కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. దేశ రాజధాని దిల్లీ సహా ముంబయి మహా నగరంలో కొద్దిరోజుల పాటు విజృంభించిన కరోనా కేసులు ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్నాయి. అయితే దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, కేరళలో మాత్రం కేసులు అమాంతం పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో కర్ణాటకలో 40,499 కేసులు వెలుగుచూశాయి. నిన్నటితో (41,457) పోలిస్తే కాస్త తక్కువే అయినప్పటికీ ఈ మహమ్మారి కారణంగా మరో 21 మంది మృతిచెందారు. పాజిటివిటీ రేటు 18.80 శాతానికి చేరింది. రాజధాని బెంగళూరులోనే 24,135 కేసులు బయటపడటం గమనార్హం. ఐదుగురు మరణించారు. 1,84,000 యాక్టివ్‌ కేసులున్నాయి. ఈ సంఖ్య రాష్ట్రవ్యాప్తంగా 2,67,650గా ఉంది.

కేరళలో బుధవారం ఒక్కరోజే 34,199 మందికి వైరస్​ నిర్ధరణ అయింది. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 54,41, 511కు చేరింది. మంగళవారం (28,481)తో పోలిస్తే.. 5,718 కేసులు అధికంగా నమోదయ్యాయి. రాష్ట్రంలో బుధవారం 91,983 పరీక్షలు నిర్వహించామని, 1.68 లక్షల క్రియాశీల కేసులు ఉన్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడిచింది. ఒక్కరోజే రాష్ట్రంలో 134 మంది ప్రాణాలు కోల్పోవడం భయాందోళన కలిగిస్తోంది.

మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తర్​ప్రదేశ్​లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 17,776 మందికి పాజిటివ్​గా తేలింది. దీంతో రాష్ట్రంలో క్రియాశీల కేసుల సంఖ్య 98,238కి చేరింది. ఏడుగురు మృతి చెందడంతో.. మరణాల సంఖ్య 22,990కి చేరింది. కొత్త కేసుల్లో ఒక్క లఖ్​నవూలోనే 3,516 మందికి వైరస్​ సోకడం ఆందోళన కలిగించే అంశం.

రాజధాని దిల్లీలో కేసుల్లో తగ్గుదల కనిపించినప్పటికీ.. మరణాలు సంఖ్య పెరిగింది. బుధవారం 13,785 మంది వైరస్‌ బారిన పడగా, 35 మంది మృతిచెందారు. పాజిటివిటీ రేటు 23.86 శాతంగా నమోదైంది. 16,580 మంది కోలుకున్నారు. 75,282 యాక్టివ్‌ కేసులున్నాయి.

ఆర్థిక రాజధాని ముంబయిలో కేసుల్లో తగ్గుముఖం కనిపిస్తోంది. కొత్తగా 6,032 కేసులు బయటపడ్డాయి. 12 మంది మృతిచెందారు. 18,241 మంది కోలుకున్నట్లు ముంబయి పురపాలక శాఖ (బీఎంసీ) వెల్లడించింది. ప్రస్తుతం 31,856 యాక్టివ్‌ కేసులున్నట్లు తెలిపింది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని