Karti Chidambaram: ఒకటి బోగస్, ఇంకోటి మోర్‌ బోగస్‌, మరొకటి మోస్ట్ బోగస్‌..!

వీసా కుంభకోణం కేసులో కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారు. దానిలో భాగంగా గురువారం ఆయన సీబీఐ అధికారుల ముందు హాజరయ్యారు.

Updated : 26 May 2022 12:51 IST

తనపై ఉన్న కేసుల గురించి కార్తి చిదంబరం వ్యాఖ్య

దిల్లీ: వీసా కుంభకోణం కేసులో కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారు. దానిలో భాగంగా గురువారం ఆయన సీబీఐ అధికారుల ముందు హాజరయ్యారు. ఈ క్రమంలో కార్యాలయం ఎదుట ఆయన మీడియాతో మాట్లాడుతూ దర్యాప్తు సంస్థల వైఖరిని తప్పుపట్టారు. 

దర్యాప్తు సంస్థలు తనపై మోపే ప్రతి కేసూ బోగసేనన్నారు. ‘ఒకటి బోగస్, ఇంకోటి మోర్ బోగస్‌, మరొకటి మోస్ట్ బోగస్’ అంటూ తనపై పెట్టిన కేసుల గురించి వ్యాఖ్యానించారు. అలాగే తాను ఏ ఒక్క చైనా దేశీయుడికి వీసా సదుపాయం కల్పించలేదని వివరణ ఇచ్చారు. సుమారు రూ. 50 లక్షలు తీసుకుని.. చైనాకు చెందిన 250 మందికి కార్తీ చిదంబరం వీసాలు ఇప్పించారన్నది ప్రధాన ఆరోపణ. కార్తీ తండ్రి పి.చిదంబరం కేంద్ర హోంమంత్రిగా ఉన్న సమయంలో ఈ వ్యవహారం జరిగినట్లు సీబీఐ వెల్లడించింది. దీనిపై దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. చిదంబరం సన్నిహితుడు, ఈ కేసుతో సంబంధం ఉన్న ​భాస్కర రామన్​ను గత వారం అదుపులోకి తీసుకొంది.

కార్తి పలు కేసుల్లో విచారణ ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. ఐఎన్‌ఎక్స్‌ మీడియా అనుమతులు, ఎయిర్‌సెల్‌ ఒప్పందం విషయాల్లో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలతో సీబీఐ, ఈడీ ఆయనపై కేసులు నమోదు చేశాయి. ఐఎన్‌ఎక్స్‌ కేసులో 2018లో సీబీఐ కార్తిని అరెస్టు చేయగా.. నెల తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని