Published : 02 Jan 2021 11:25 IST

కశ్మీర్‌లో ఉగ్రవాదుల మరో ఘాతుకం!

స్థానికేతరుడి హత్య

శ్రీనగర్‌: జమ్మూ-కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. ఇటీవల స్థానిక నివాస ధ్రువీకరణ పత్రం పొందిన ఓ స్థానికేతరుడిని దారుణంగా హత్యచేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. సత్‌పాల్‌ నిశ్చల్‌‌(50) అనే నగల వ్యాపారి కశ్మీర్‌లో 50ఏళ్లుగా నివాసముంటున్నారు. శ్రీనగర్‌లోని ఓ మార్కెట్‌కు వెళ్లిన ఆయనపై ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. గరువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికేతరులను బెదిరించాలన్న ఉద్దేశంతోనే ఉగ్రవాదులు ఈ ఘాతుకాలకు పాల్పడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

రెసిస్టంట్‌ ఫ్రంట్‌ అనే ఉగ్రముఠా ఈ దారుణానికి పాల్పడ్డట్లు ప్రకటించుకుంది. స్థానిక నివాస ధ్రువీకరణ పత్రం పొందే ఎవరినైనా ఆక్రమణదారులుగాలనే భావిస్తామని చెప్పుకొచ్చింది. అధికరణ 370 రద్దు తర్వాత జమ్మూ-కశ్మీర్‌ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడిపోయిన విషయం తెలిసిందే. దీంతో అక్కడి స్థిరాస్తులను స్థానికేతరులు సైతం కొనుగోలు చేసేందుకు కేంద్రం వెసులుబాటు కల్పించింది. ఇప్పటి వరకు 10 లక్షల మంది స్థానికేతరులు స్థానిక నివాస ధ్రువీకరణ పత్రం పొందినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో చాలా మంది అనేక సంవత్సరాల క్రితం అక్కడికి వెళ్లి నివాసముంటున్నవారే. అయితే, వీరిలో స్థానికేతరులు ఎవరన్నది మాత్రం ప్రభుత్వం వెల్లడించడం లేదు.

ఇవీ చదవండి..

వెళ్లేముందు అభాసుపాలు!

కాలిఫోర్నియాలో మరణమృదంగం

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని