CM Bungalow: కేజ్రీవాల్ అధికారిక నివాసం వివాదం.. రంగంలోకి CBI
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal).. అధికారిక నివాసం మరమ్మతుల్లో అవకతవకలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలపై సీబీఐ ప్రాథమిక విచారణ (Preliminary Enquiry) ప్రారంభించింది.
దిల్లీ: దిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal).. అధికారిక నివాసం మరమ్మతుల కోసం కోట్ల రూపాయాలు వెచ్చించారని భాజపా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వివాదంపై సీబీఐ ప్రాథమిక విచారణ (Preliminary Enquiry) ప్రారంభించింది. అధికారిక నివాసం మరమ్మతుల్లో ‘అక్రమాలు, ఉల్లంఘనలపై’ వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఈ ప్రాథమిక దర్యాప్తు (PE)ని నమోదు చేసినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు వెల్లడించారు.
దిల్లీ ప్రభుత్వంలో గుర్తించని ప్రజాసేవకులపై సీబీఐ ఈ ప్రిలిమినరీ ఎంక్వైరీ (PE)ని నమోదు చేసింది. ప్రాథమిక విచారణ అనేది.. వచ్చిన ఆరోపణలపై రెగ్యులర్ ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయా? లేదా? అనే విషయాన్ని తెలుసుకునేందుకు దోహదపడుతుంది. ఈ క్రమంలోనే అధికారిక నివాసం మరమ్మతులకు సంబంధించిన రికార్డులను సదరు శాఖ నుంచి అడిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా టెండర్ దస్త్రాలు, కాంట్రాక్టర్లు సమర్పించిన బిడ్లు, నిర్మాణ అనుమతులు, తదనంతరం మార్బుల్ ఫ్లోరింగ్‌లో మార్పులు ఇతర పనుల వివరాలను కోరినట్లు అధికారులు వెల్లడించారు.
మణిపుర్ వెళ్లేందుకు మోదీకి ఒక్కరోజు కూడా వీలు కాలేదా?: కాంగ్రెస్
మరోవైపు, అర్వింద్ కేజ్రీవాల్ అధికారిక నివాసం విషయంలో వచ్చిన ఆరోపణలను, తాజా చర్యలను ఆమ్ఆద్మీ పార్టీ తోసిపుచ్చింది. కేవలం తమ పార్టీని (AAP) అంతం చేసేందుకే భాజపా అన్ని అధికారాలను ఉపయోగిస్తోందని ఆరోపించింది. ఇప్పటికే దేశంలో అత్యుత్తమ మంత్రులుగా నిలిచిన సత్యేందర్ జైన్, మనీశ్ సిసోదియాలను జైల్లో పెట్టారంటూ మండిపడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Uttarakhand Tunnel: ఏ క్షణమైనా మీ వాళ్లు బయటకు.. కూలీల కుటుంబాలకు సమాచారం
Uttarakhand Tunnel: ఉత్తరాఖండ్‌లోని సొరంగంలో చిక్కుకున్న కూలీలు ఏ క్షణమైనా బయటకు వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. సొరంగం వద్ద శరవేగంగా తవ్వకాలు జరుగుతున్నాయి. -
Kota: నీట్ అభ్యర్థి ఆత్మహత్య.. ఈ ఏడాదిలో కోటాలో 28కి చేరిన మరణాలు
పోటీ పరీక్షల శిక్షణకు ప్రసిద్ధి చెందిన రాజస్థాన్‌లోని కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఈ ఏడాది అక్కడ జరిగిన బలవన్మరణాల సంఖ్య 28కి చేరుకుంది. -
Kangana Ranaut: ఇందిరాగాంధీతో కంగన చిట్‌చాట్.. అదెలా సాధ్యమంటే..?
కంగనా రనౌత్(Kangana Ranaut) స్వీయ దర్శకత్వంలో ‘ఎమర్జెన్సీ’(Emergency) చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ క్రమంలో ఆమె షేర్ చేసిన చిత్రాలు వైరల్‌గా మారాయి. -
Uttarakhand Tunnel: సొరంగం వద్ద శరవేగంగా పనులు.. ఇంకా 10 మీటర్ల దూరంలో కూలీలు
Uttarakhand Tunnel: ఉత్తరాఖండ్‌లోని సొరంగంలో చిక్కుకున్న కూలీలను కాపాడేందుకు సహాయక చర్యలు శరవేగంగా కొనసాగుతున్నాయి. నేలకు సమాంతరంగా చేపట్టిన మాన్యువల్ డ్రిల్లింగ్‌లో ఇంకా 10 మీటర్ల తవ్వకాలు పూర్తిచేస్తే కూలీల వద్దకు చేరుకోవచ్చని అధికారులు తెలిపారు. -
Gold Saree: బంగారు చీర.. ధర రూ.2.25 లక్షలు
దిల్లీలో జరుగుతున్న 42వ భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలో బంగారు పూత పూసిన ఓ చీర రూ.2.25 లక్షల ధర పలికింది. -
రూ.4.60 లక్షల ధర పలికిన ముర్రాజాతి గేదె
హరియాణాలోని ఝజ్జర్ జిల్లా ఖాన్‌పుర్‌కు చెందిన ఓ ముర్రాజాతి గేదె రికార్డుస్థాయిలో రూ.4.60 లక్షలకు అమ్ముడుపోయింది. -
రన్‌వేపై బారాత్.. విమానంలో వివాహం
యూఏఈకి చెందిన ఓ వ్యాపారవేత్త ఆకాశవీధుల్లో తన కుమార్తె వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. -
మౌలిక వసతుల విస్తరణతోనే అందరికీ చేరువగా న్యాయం
ప్రజానుకూల తీర్పులు ఇవ్వడం ద్వారా మాత్రమే అందరికీ అందుబాటులోకి న్యాయాన్ని తీసుకురాలేమని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. -
నిబంధనలు ఉల్లంఘించే పార్టీల గుర్తింపు రద్దు అధికారం ఈసీకి ఉండాలి
చట్టాలను, నమోదు నిబంధనలను ఉల్లంఘించే రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేసే అధికారం ఎన్నికల సంఘాని(ఈసీ)కి తప్పనిసరిగా ఉండాలని సుప్రీంకోర్టుకు సమర్పించిన వాదనల్లో పిటిషనర్ గట్టిగా కోరారు. -
గుజరాత్లో అకాల వర్షాలు
గుజరాత్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. పలు ప్రాంతాల్లో వడగండ్లు పడ్డాయి. పలు జిల్లాల్లో పిడుగులు పడి 27 మంది మృతి చెందారు. -
36 మీటర్లు పూర్తయిన తవ్వకం
ఉత్తరాఖండ్ సొరంగంలో చిక్కుకున్న 41 మందిని రక్షించడానికి కొండ పైభాగం నుంచి చేపట్టిన 86 మీటర్ల డ్రిల్లింగ్ పనిలో సోమవారం రాత్రికి 36 మీటర్లు పూర్తయింది. -
మార్చి నాటికి ప్రిడేటర్ డ్రోన్ల ఒప్పందం ఖరారు
అమెరికా నుంచి 31 ఎంక్యూ-9బి ప్రిడేటర్ సాయుధ డ్రోన్ల కొనుగోలుకు ఉద్దేశించిన కీలక ఒప్పందాన్ని వచ్చే ఏడాది మార్చి నాటికి ఖరారు చేసుకోవాలని భారత్ భావిస్తోంది. -
సంక్షిప్త వార్తలు
మహాత్మా గాంధీ గత శతాబ్దంలో మహా పురుషుడైతే, ఈ శతాబ్దంలో ప్రధాని నరేంద్ర మోదీ యుగ పురుషుడని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అభివర్ణించారు. -
Jagdeep Dhankar: గాంధీ మహా పురుషుడు.. మోదీ యుగ పురుషుడు: ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్
ప్రముఖ జైన మత గురువు, ఆధ్యాత్మిక వేత్త శ్రీమద్ రాజ్‌చంద్రాజీ జయంతి వేడుకల్లో భారత ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.


తాజా వార్తలు (Latest News)
-
Uttarakhand Tunnel: ఏ క్షణమైనా మీ వాళ్లు బయటకు.. కూలీల కుటుంబాలకు సమాచారం
-
Britain-Greek: పురాతన శిల్పాల వివాదం.. ప్రధానుల భేటీ రద్దు
-
Malla Reddy: మహేశ్‌బాబు ‘బిజినెస్‌మేన్’ చూసి ఎంపీ అయ్యా.. మల్లారెడ్డి స్పీచ్‌కు మహేశ్‌బాబు నవ్వులే నవ్వులు!
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Pat Cummins: నా చరమాంకంలోనూ ‘కోహ్లీ వికెట్టే’ గుర్తొస్తుంది: కమిన్స్
-
Digital Payments: ఆన్లైన్ మోసాలకు అడ్డుకట్ట.. తొలి UPI చెల్లింపునకు 4 గంటల వ్యవధి?