Arvind Kejriwal: బెయిల్‌ నిలిపివేతపై.. సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్‌

తన బెయిల్‌పై దిల్లీ హైకోర్టు విధించిన మధ్యంతర స్టేను సవాల్‌ చేస్తూ అరవింద్‌ కేజ్రీవాల్‌ తాజాగా సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

Published : 23 Jun 2024 22:12 IST

దిల్లీ: మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో దిల్లీ సీఎం, ఆప్‌ జాతీయ కన్వీనర్ అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)కు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేస్తూ ట్రయల్‌ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను దిల్లీ హైకోర్టు నిలిపివేసిన విషయం తెలిసిందే. దీంతో తిహాడ్‌ జైలునుంచి ఆయన విడుదల చివరి క్షణంలో నిలిచిపోయింది. ఈ క్రమంలోనే బెయిల్‌పై హైకోర్టు (Delhi High Court) విధించిన మధ్యంతర స్టేను సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ తాజాగా సుప్రీం కోర్టు (Supreme Court)ను ఆశ్రయించారు.

‘నీట్‌’ వ్యవహారంలో కీలక పరిణామం.. సీబీఐ రంగ ప్రవేశం

ఈ కేసులో కేజ్రీవాల్‌కు సాధారణ బెయిల్‌ మంజూరు చేస్తూ ట్రయల్‌ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. రూ.లక్ష వ్యక్తిగత బాండు సమర్పించాలని, విచారణకు ఆటంకం కలిగించరాదని, సాక్షుల్ని ప్రభావితం చేయకూడదని ఆంక్షలు విధించింది. ఎప్పుడు అవసరమైతే అప్పుడు కోర్టుకు హాజరై విచారణకు సహకరించాలని ఆదేశించింది. అయితే.. ట్రయల్‌ కోర్టు తమ వాదనలకు తగినంత సమయం ఇవ్వలేదని ఆరోపిస్తూ ఈడీ దిల్లీ హైకోర్టుకు వెళ్లింది. దీంతో కింది కోర్టు ఉత్తర్వును హైకోర్టు శుక్రవారం నిలిపివేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని