Kejriwal: మోదీ సర్‌.. దేశంలో పాఠశాలల పురోగతికి కలిసి పనిచేద్దాం..!

దేశవ్యాప్తంగా పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు కలిసి పనిచేద్దామని దిల్లీ సీఎం కేజ్రీవాల్‌.. ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. దిల్లీలో ప్రభుత్వ పాఠశాలలను ఐదేళ్లలోనే ఎంతో మెరుగుపరచామని.. ఇలాగే దేశ వ్యాప్తంగా అభివృద్ధి చేసేందుకు తమ అనుభవాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

Published : 20 Oct 2022 00:01 IST

దిల్లీ: గుజరాత్‌తోపాటు దేశ రాజధాని దిల్లీలో పలు అంశాలపై ఆమ్‌ఆద్మీ పార్టీ, భాజపా మధ్య మాటల యుద్ధం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో దేశంలోని పాఠశాలల పురోగతికి కలిసి పనిచేద్దామని దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశారు. గుజరాత్‌ పర్యటనలో భాగంగా గాంధీనగర్‌లో పాఠశాల విద్యార్థులతో ముచ్చటించడంపై స్పందించిన కేజ్రీవాల్‌.. పాఠశాలలను మెరుగుపరచడంలో తమ ప్రభుత్వం ఎంతో ప్రావీణ్యం సంపాదించిందని, వాటిని ఉపయోగించుకోవాలని సూచించారు.

‘పీఎం సర్‌, దిల్లీలో విద్యా రంగంలో అద్భుతమైన పనితీరు కనబరిచాం. గడిచిన ఐదు సంవత్సరాల్లో దిల్లీ ప్రభుత్వ పాఠశాలలు అసాధారణ స్థాయిలో మెరుగుపడ్డాయి. ఇలాగే కేవలం ఐదేళ్లలో దేశంలోని పాఠశాలలన్నింటినీ అభివృద్ధి చేయవచ్చు. ఈ రంగంలో మాకు అనుభవం ఉంది. దీనిని పూర్తిగా ఉపయోగించుకోండి. ఈ విషయంలో దేశం కోసం కలిసి పనిచేద్దాం’ అని అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. పాఠశాల విద్యార్థులతో కలిసి ప్రధాని మోదీ కూర్చున్న ఫొటోను షేర్‌ చేసిన ఆయన.. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు విద్య గురించి మాట్లాడటం సంతోషకర విషయమన్నారు. ఇది తమ పార్టీ సాధించిన అతిపెద్ద విజయమన్న కేజ్రీవాల్‌.. ప్రభుత్వాలన్నీ కలిసి తమ పాఠశాలలను కేవలం ఐదేళ్లలోనే గొప్పగా తీర్చిదిద్దుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని